ఓపెన్ అయిన ఇనాయా.. అతనంటే క్రష్, ఇష్టమంటూ?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని అప్పుడే ఐదవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.కాగా ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 6 Inaya Sultana Says Rj Surya Is Her Crush Bigg Boss Season 6,-TeluguStop.com

ఇక ఐదో వారంలో భాగంగా బిగ్ బాస్ పుట్టినరోజు సందర్భంగా హౌస్ లో సందడి సందడిగా ఉంది.ఇక ప్రేక్షకులను బిగ్ బాస్ పుట్టిన రోజు సందర్భంగా ఎంటర్ టైన్ చేయడానికి కుటుంబ సభ్యులు బాగానే ప్రయత్నిస్తున్నారు.

గతవారం హౌస్ లో గొడవలు, కొట్లాటలతో సాగగా ఈవారం ఆనందాలు సంతోషాలతో సరదా సరదాగా సాగుతోంది.

బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఎంటర్టైన్ చేయడం కోసం వాసంతి మెరీనా ఇద్దరు రాత్రి సమయంలో దెయ్యాల లాగా వేషం వేసుకొని పడుకున్న వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు.

కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.ఆ తరువాత ఇనయ కన్ఫెషన్ రూమ్ కి పిలిపించాడు బిగ్ బాస్.

ఆమె ముందు ఒక కేకును పెట్టి మీరు ఎదురుగా ఉన్న కేక్ తినాలంటే ఇంట్లో జరుగుతున్న ఆసక్తికర విషయాలు చెప్పాలి అని ఆదేశించాడు బిగ్ బాస్.అప్పుడు ఆమె ఇంతకుముందు డంట్స్ ఆడినప్పుడు నాకు రాజ్ అంటే ఇష్టం అని చెప్పాను కానీ నాకు నిజానికి ఆర్జే సూర్య అంటే ఇష్టం.

అతనే నా క్రష్.రోజు రోజుకు ఇంకా నచ్చేస్తున్నాడు.ఆరోహితో మాట్లాడినప్పుడు కాస్త కోపం వచ్చేది అని తెలిపింది ఇనయ.ఇక మొత్తానికి తన మనసులో మాట బయట పెట్టి ప్రేక్షకులకు ఒకసారిగా షాక్ ఇచ్చింది ఇనయ.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఐదవ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమెంట్ కావడంతో ప్రస్తుతం కేవలం 17 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube