Faima Aviction Free Pass : ఫైమా ఇప్పటికీ హౌస్ లో ఉండటానికి ఆ ఒక్క పనే కారణం.. అది చేసి ఉండకపోతే?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.మరి ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో చాలావరకు ప్రేక్షకుల అంచనాలను తప్పు అని నిరూపిస్తూ బిగ్ బాస్ తనకు నచ్చిన వారిని ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని కచ్చితంగా ఎలిమినేట్ చేసి తీరుతాడు.

 Bigg Boss Telugu 6 Faima Use Eviction Free Pass , Bigg Boss Telugu 6 , Faima , E-TeluguStop.com

ఇప్పటికీ ఎన్నో ఎలిమినేషన్స్ విషయంలో బిగ్ బాస్ తనకు ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.కేవలం బిగ్ బాస్ సీజన్ 6 విషయంలోనే కాకుండా గత సీజన్ లలో కూడా ఇదే జరిగింది.

అందుకు బిగ్ బాస్ హౌస్ లో తాజాగా జరిగిన ఎపిసోడ్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే కొందరు కంటెస్టెంట్ లను సేవ్ చేయగా తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కొంతమందిని సేవ్ చేస్తూ వచ్చాడు.చివరిగా రాజ్,పైమా మాత్రమే మిగిలారు.అయితే మొదట్లో ఎలా అయినా తన సేవ్ అవుతాను అనుకున్న ఫైమా తన దగ్గర ఉన్న ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ని రాజ్ కోసం వాడాలని అనుకుంది.అప్పుడు బిగ్బాస్ హోస్ట్ నాగార్జున పైమాని హెచ్చరిస్తూ ఆలోచించుకో ఫైమా మీ అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో అంటూ పైమాకు చిన్న హింట్ ఇచ్చాడు.

అప్పుడు నాగార్జున మాటలకు భయపడిపోయిన ప్రేమ చివరి నిమిషంలో తన దగ్గర ఉన్న ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ను తన కోసమే వాడుతున్నట్లు తెలిపింది.అలా తీరా ఎలిమినేషన్స్ చివరి స్థానంలో పైమానే ఉండేసరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ తో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కింది.అయితే ఒకవేళ పైమా గనుక తను అనుకున్న విధంగా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ను రాజ్ కోసం ఉపయోగించి ఉంటే తప్పకుండా తాను ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది.ఇక 12వ వారం ఫైమా సేవ్ అవ్వడంతో ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న రాజ్ ను ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు బిగ్ బాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube