Srihan Adi Reddy : ఆదిరెడ్డితో ఫ్రెండ్ షిప్ వద్దు బాబోయ్.. శ్రీహాన్ వైరల్ కామెంట్స్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 12 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకునే 13వ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది.ఇకపోతే వారాలు గడిచే కొద్ది కంటెస్టెంట్ లలో అలాగే ప్రేక్షకులలో టెన్షన్ మొదలైంది.

 Bigg Boss Telugu 6 Contestants About Lifelong Friends , Bigg Boss 6, Srihan, Aad-TeluguStop.com

ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారు ఎవరు విన్నర్ గా నిలుస్తారు ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలిన విషయం మనందరికీ తెలిసిందే.

మిగిలిన కంటెస్టెంట్లు అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అవ్వగా రోహిత్ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.

ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు వరస్ట్ కెప్టెన్ ఎవరు అన్న విషయాలపై ఆరా తీయగా ఇనయ బెస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి వరెస్ట్ కెప్టెన్ అని తేలిన విషయం తెలిసిందే.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ప్రోమో ని విడుదల చేశారు.ఇక ఆ వీడియోలో బిగ్ బాస్ పోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో కలిసి ఒక టాస్క్ ని ఆడించాడు.

హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఎవరితో జీవితాంతం ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ ను వద్దనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలపాలి అని టాస్క్ ని ఇచ్చాడు.అప్పుడు మొదట శ్రీహాన్‌, రోహిత్ ఫోటో చూపిస్తూ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండాలి అని చెప్పి ఆది రెడ్డి ఫోటో చూపిస్తూ ఈయనను తరచూ కలవడం కష్టం అని తెలిపారు శ్రీహాన్‌.

నాగార్జున ఆదిరెడ్డి హైదరాబాదుకు చేరొచ్చు కదా అనగా ఈయన కోసం చేరాలి అంటూ ఫన్నీగా స్పందిస్తాడు ఆదిరెడ్డి.

అనంతరం కీర్తి ఇనయ బాగా క్లోజ్ అయింది అని అనగా శ్రీహాన్ దూరంగా ఉన్నాడా అనడంతో సార్ అని నవ్వుతుంది కీర్తి.ఆ తరువాత రేవంత్‌ తెలివిగా అబ్బాయిల నుంచి శ్రీహాన్‌, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు.అనంతరం బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్‌.

అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్‌, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ, రేవంత్ కి క్రాక్, ఫైమాకి జాతి రత్నాలు లాంటి పోస్టర్స్ అంకితం చేశారు.అనంతరం అందరూ కలిసి చేతులు పట్టుకొని జాతి రత్నాలు సాంగ్ కి స్టెప్పులు వేశారు.

అప్పుడు వెంటనే నాగార్జున మీరందరూ నిజంగానే జాతి రత్నాలు అని అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube