బిగ్ బాస్ సెకండ్ కెప్టెన్‌గా అతనే.. ఏకగ్రీవంతో ఎన్నిక?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్లో కంటే మరింత రెట్టింపు ఇస్తుందని ముందు నుంచి చెప్పినట్టుగానే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు.ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ.

 Bigg Boss Telugu 5 Vishwa Second Captain Bigg Boss House, Bigg Boss 5 , Vishwa,-TeluguStop.com

టాస్క్ పోటీపడి చేయడంతో కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు తలెత్తుతున్నాయి.ఈ విధంగా కంటెస్టెంట్స్ గొడవ పడుతూ చివరికి కొట్టుకొనే వరకు కూడా వెళుతున్నారు.

ముఖ్యంగా హౌస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.గత వారం కెప్టెన్సీ టాస్క్ లో సిరి విజేత కాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కుటుంబ సభ్యులను రెండు జట్లుగా విడదీసి వారి మధ్య టాస్క్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లను బిగ్ బాస్ బ్లూ టీమ్, ఎల్లో టీమ్ గా విభజించి టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య బీభత్సమైన పోట్లాట, పోటీ నెలకొంది.

ఈ టాస్క్ గెలవడం కోసం ఎంతో స్నేహంగా ఉన్న కంటెస్టెంట్ లు కూడా బద్ద శత్రువులుగా మారిపోయారు.ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ పోటీ కారణంగా లోబో కిందపడి తీవ్ర అస్వస్థతకు కూడా గురయ్యాడు.

ఈ క్రమంలోనే ఈ రెండు జట్లు తీవ్ర స్థాయిలో పోటీ పడగా మరి ఈవారం కెప్టెన్సీగా ఏ టీమ్ సభ్యులు గెలిచారనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Telugu Bigg Boss, Vishwa-Movie

ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బ్లూ టీం సభ్యులు గెలిచినట్టు తెలుస్తోంది.ఇక ఈ జట్టులో ఉన్నటువంటి సభ్యులు ఏకగ్రీవంగా కంటెస్టెంట్ విశ్వను ఈవారం హౌస్ కెప్టెన్ గా ఎన్నుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.నిజంగానే సెకండ్ కెప్టెన్ గా విశ్వ ఎంపికయ్యాడా? లేదా? అనే విషయం ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలియనుంది.ఇక మొదటి వారంలో హౌస్ మేనేజర్ గా కొనసాగిన విశ్వా రెండవ వారంలో కెప్టెన్ కావడం విశేషం.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube