కొత్త కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ.. ఖరీదెంతంటే?

Bigg Boss Telugu 5 Vishwa Buys His Dream Car Bmw

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఒకరైన విశ్వ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారు.ఖరీదైన కారును కొనుగోలు చేయాలని భావించిన విశ్వ ఆ కలను నెరవేర్చుకున్నారు.

 Bigg Boss Telugu 5 Vishwa Buys His Dream Car Bmw-TeluguStop.com

లగ్జరీ  కారును కొనుగోలు చేసిన విశ్వ ఆ కారు ద్వారా తన రేంజ్ ను మార్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ వారాలు ఉన్న కంటెస్టెంట్లలో విశ్వ కూడా ఒకరు.

బిగ్ బాస్ షో వల్ల విశ్వ దశ మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Bigg Boss Telugu 5 Vishwa Buys His Dream Car Bmw-కొత్త కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ.. ఖరీదెంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో విశ్వ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో విశ్వ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.కారు గురించి విశ్వ చెబుతూ తన జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చిందని తెలిపారు.

ఎంతో ఇష్టమైన కారును కొనుగోలు చేసి కలను నెరవేర్చుకున్నానని విశ్వ వెల్లడించారు.కలలు కన్న కారును కొనుగోలు చేస్తే ఆ సంతోషమే వేరని విశ్వ పేర్కొన్నారు.

కారు కొనడానికి కారణమైన బిగ్ బాస్ కు, దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నానని విశ్వ వెల్లడించారు.విశ్వ కొనుగోలు చేసిన ఈ కారు ధర 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్న విశ్వ బయటకు వచ్చిన తర్వాత బీఎండబ్ల్యూలో తిరుగుతున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ వల్ల తనకు ఆఫర్లు పెరుగుతాయని విశ్వ భావిస్తున్నారు.బిగ్ బాస్ షో ఎంతోమంది సెలబ్రిటీలకు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో విశ్వ సినిమాలలో, టీవీ షోలలో ఆఫర్లను పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

#BMW Car #Bigg Boss Show #Vishwa #Bigg Bosss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube