ట్రాన్స్‌జెండర్ అంటే రోడ్లమీద అడుక్కునేవాళ్లే గుర్తొస్తారు.. ఆమెకే సపోర్ట్ అంటూ?

Bigg Boss Telugu 5 Tamanna Simhadri Support Priyanka Singh

బిగ్ బాస్ షో సీజన్ 5 టాప్ 5 కంటెస్టెంట్లలో ఎవరు నిలుస్తారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు.

 Bigg Boss Telugu 5 Tamanna Simhadri Support Priyanka Singh-TeluguStop.com

ఇప్పటికే ప్రముఖ నటుడు నాగబాబు ప్రియాంక సింగ్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి కూడా ప్రియాంక సింగ్ కు మద్దతు ప్రకటించారు.

బిగ్ బాస్ సీజన్ 3లో రవికృష్ణతో గొడవల ద్వారా తమన్నా సింహాద్రి పాపులర్ అయ్యారు.

 Bigg Boss Telugu 5 Tamanna Simhadri Support Priyanka Singh-ట్రాన్స్‌జెండర్ అంటే రోడ్లమీద అడుక్కునేవాళ్లే గుర్తొస్తారు.. ఆమెకే సపోర్ట్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తమన్నా సింహాద్రి ప్రవర్తన వల్ల ఆమె ఎక్కువ కాలం హౌస్ లో కొనసాగలేదు.

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ షో గురించి మాట్లాడటానికి తమన్నా ఆసక్తి చూపలేదు.అయితే తాజాగా ప్రియాంక సింగ్ ను సపోర్ట్ చేస్తూ తమన్నా సింహాద్రి వీడియో రిలీజ్ చేశారు.

చాలారోజుల నుంచి తాను వీడియో చేయాలని అనుకుంటున్నానని బిగ్ బాస్ 3 ముగిసిన చాలారోజుల తర్వాత వీడియో చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

చాలామందికి ట్రాన్స్ జెండర్ అని వింటే రోడ్లపై అడుక్కునేవాళ్లు గుర్తుకు వస్తారని తమన్నా సింహాద్రి వెల్లడించారు.

Telugu Nagababu, Bigg Boss, Biggboss, Bigg Boss Top, Priyanka Singh, Season, Sunny, Transgender-Movie

అయితే సొంతవాళ్లకు దూరమై ఎన్నో ఇబ్బందులు పడినా గౌరవంగా బ్రతకడానికి కొంతమంది ముందుకు వస్తారని వాళ్లలో ప్రియాంక సింగ్ ఒకరని తమన్నా సింహాద్రి వెల్లడించారు.ప్రియాంక బిగ్ బాస్ కు వెళ్లడం సంతోషంగా ఉందని తమన్నా సింహాద్రి చెప్పుకొచ్చారు.

Telugu Nagababu, Bigg Boss, Biggboss, Bigg Boss Top, Priyanka Singh, Season, Sunny, Transgender-Movie

ఇతర భాషల్లో బిగ్ బాస్ షోలోకి ట్రాన్స్ జెండర్లను తీసుకున్నా ఎక్కువకాలం వాళ్లు హౌస్ లో ఉండలేదని ప్రియాంక ఫినాలేలో అడుగు పెడితే మరో లెవెల్ లో ఉంటుందని ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తే ప్రియాంక సింగ్ విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.ట్రాన్స్ ఉమెన్ విన్నర్ గా నిలిస్తే అది దేశంలోనే రికార్డ్ అవుతుందని తమన్నా సింహాద్రి చెప్పుకొచ్చారు.

#Bigg Boss #BiggBoss #Bigg Boss #Sunny #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube