నటరాజ్ మాస్టర్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. పసిపాప ఏడుపులతో అందరికి షాక్?

బిగ్ బాస్ హౌస్ లో ఒకసారి ఉన్న వాతావరణం మరొకసారి ఉండదు.బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తూ కంటెస్టెంట్ ల మధ్య గొడవలు సృష్టిస్తే మరోసారి అందరి మధ్య ప్రేమ ఆప్యాయతలను పెంచుతారు.

 Bigg Boss Telugu 5 Sudden Surprise To Nataraj Master-TeluguStop.com

అలాగే మరికొన్ని సార్లు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు వారి వ్యక్తిగత విషయాలను చెబుతూ వారికి సర్ప్రైజ్ ఇస్తుంటారు.నిన్న జరిగిన ఎపిసోడ్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ కు బిగ్ బాస్ బిగ్ సర్ప్రైస్ ఇచ్చి ఆశ్చర్య పరిచాడు.

బిగ్ బాస్ హౌస్ లో అందరూ వారి పనులలో నిమగ్నమై ఉన్న సమయంలో పసిపాప ఏడుపు వినిపించే సరికి అందరూ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పరుగులు పెట్టారు.అయితే ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో నటరాజు మాస్టర్ తన భార్య గర్భవతిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆ సర్ప్రైస్ తన కోసమేనని గ్రహించి నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు.

 Bigg Boss Telugu 5 Sudden Surprise To Nataraj Master-నటరాజ్ మాస్టర్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. పసిపాప ఏడుపులతో అందరికి షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడే ప్రియాంక సింగ్ మాస్టర్ కన్నీటిని తుడిచి ఓదారుస్తుంది.

Telugu Baby Cry, Bigg Boss 5 Telugu, Nataraj Master, Sudden Surprise-Movie

ఇక సోఫాలో అందరూ కూర్చొని ఉండగా బిగ్ బాస్ స్క్రీన్ పై తాజాగా నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం చేయడంతో హౌస్ లో ఉన్నటువంటి సభ్యులు పెద్ద ఎత్తున అరుస్తూ చప్పట్లు కొడతారు.ఇది చూసిన నట్రాజ్ మాస్టర్ కొంతవరకు ఎమోషనల్ అవుతారు.అదేవిధంగా తన భార్య నీతూ మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి నీ మాటలు విని బేబీ నన్ను తన్నేది కదా.ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో నుంచి నీ మాటలు వింటేనాతో డిష్యుం డిష్యుం ఫైట్ చేస్తోంది.అనగానే మాస్టర్ మరింత భావోద్వేగానికి గురై వెళ్లి స్క్రీన్పై తన ఫోటోకి ముద్దు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.

#Bigg Boss #Baby Cry #Sudden Surprise #Nataraj Master

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు