గేమ్ ను గేమ్ లా చూడండి.. సిరికి సూచనలు చేసిన షణ్ముఖ్ తల్లి!

Bigg Boss Telugu 5 Shanmukh Mother Anchor Ravi Family Entry In Bigg Boss House

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కావడానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది.బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లలో కొంతమంది కంటెస్టెంట్లు విన్నర్ కావాలనే లక్ష్యంతో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయతం చేస్తున్నారు.

 Bigg Boss Telugu 5 Shanmukh Mother Anchor Ravi Family Entry In Bigg Boss House-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోని షణ్ముఖ్ జశ్వంత్, రవికి ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ, మానస్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఈ సీజన్ లో కూడా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

 Bigg Boss Telugu 5 Shanmukh Mother Anchor Ravi Family Entry In Bigg Boss House-గేమ్ ను గేమ్ లా చూడండి.. సిరికి సూచనలు చేసిన షణ్ముఖ్ తల్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఎవరు విన్నర్ అవుతారనే ప్రశ్నకు బిగ్ బాస్ ఫ్యాన్స్ కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను నిర్వాహకులు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముఖ్ జశ్వంత్ తల్లి ఎంట్రీ ఇవ్వగా షణ్ముఖ్ గుక్క పట్టి ఏడ్చేశారు.

దీప్తి సునైనాలాగుంది అని ఆమెకు సంబంధించిన సమాచారాన్ని షణ్ముఖ్ తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Telugu Deepti Sunaina, Manas, Ravi, Shanmkh Mother, Shanmukh Mother, Siri, Siri Hanmanthu, Sunny-Movie

సిరి హన్మంత్ మమ్మీ కొన్ని నచ్చడం లేదని చెప్పారని షణ్ముఖ్ తన తల్లికి చెప్పగా షణ్ముఖ్ తల్లి మాత్రం మీరు స్నేహితులే కదా, దేని గురించి ఎక్కువగా ఆలోచించకు అని షణ్ముఖ్ కు సూచనలు చేశారు.ఎక్కువగా ఎమోషనల్ కావద్దని షణ్ముఖ్ కు అతని తల్లి సూచించారు.గేమ్ ను గేమ్ లా చూడాలని షణ్ముఖ్ తల్లి షణ్ముఖ్, సిరిలకు సూచనలు చేశారు.

Telugu Deepti Sunaina, Manas, Ravi, Shanmkh Mother, Shanmukh Mother, Siri, Siri Hanmanthu, Sunny-Movie

హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో కంటెస్టెంట్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.వీక్ డేస్ లో మంచి రేటింగ్స్ ను సాధించడంలో బిగ్ బాస్ షో ఫెయిల్ అవుతున్నా వీకెండ్ లో మాత్రం ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తుండటం గమనార్హం.

#Sunny #Shanmukh Mother #Siri Hanmanthu #Siri #Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube