బ్రేకప్ చెప్పి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. షన్ను ఎమోషనల్ స్టోరీ?

Bigg Boss Telugu 5 Shanmukh Jaswanth Says He Had Suicidal Thoughts

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వారు జీవితంలో ఎదుర్కొన్న పలు విషయాల గురించి పంచుకుంటారు.ఈ క్రమంలోనే పలువురు కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు.

 Bigg Boss Telugu 5 Shanmukh Jaswanth Says He Had Suicidal Thoughts-TeluguStop.com

మొదట సన్నీ తన గురించి మాట్లాడుతూ.తన తల్లి పేరు కళావతి అని.

తన తల్లి ముగ్గురు అబ్బాయిలను పెంచడం అనేది ఎంత ఛాలెంజింగ్ విషయం అనేది నాకు బాగా తెలుసు.అంటూ సన్నీ తన తల్లి గురించి చెప్పుకొచ్చాడు.

 Bigg Boss Telugu 5 Shanmukh Jaswanth Says He Had Suicidal Thoughts-బ్రేకప్ చెప్పి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. షన్ను ఎమోషనల్ స్టోరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత జెస్సీ మాట్లాడుతూ తనకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉందని తెలిపాడు.

తనకు గొంతు సమస్య ఉన్నప్పటికీ తాను మోడల్ గా ఎదిగానని అంతేకాకుండా పలు అవార్డులు కూడా అందుకున్న అని తెలిపాడు.

ఇప్పటికి కూడా తన తల్లి తాను మోడల్ అని చెప్పు కోదు అంటూ చెప్పుకొచ్చాడు.షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.

ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చిందని అదే సమయంలో లవ్‌ బ్రేకప్ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యను అని తెలిపాడు.సూసైడ్చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు.

నేను డోర్ తీయక పోయేసరికి నేరుగా లోపలకు వచ్చి నాలుగు పీకాడు.వాడివల్లే నేను బతికున్నాను.వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది.

Telugu Jaswanth Padala, Shanmukhlove, Sunny, Tollywood, Viva Short, Web-Movie

నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన పేరెంట్స్‌, కజిన్స్‌కు ఎప్పటికి రుణపడి ఉంటా అని పేర్కొన్నాడు.ఇక షణ్ముఖ్ జస్వంత్ విషయానికి వస్తే.సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ కూడా ఒకరు.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు.షణ్ముఖ్ జస్వంత్ ఇప్పటివరకూ ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తీసి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు షణ్ముఖ్ జస్వంత్.

#ShanmukhLove #Sunny #Jaswanth Padala #Web #Viva Short

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube