ఆమె గుర్తు రావడం వల్ల భయం అంటూ షణ్ముఖ్ మ్యాటర్ లీక్?

తెలుగులో ప్రస్తుతం ప్రసారమవుతున్న షోలల్లో బిగ్‌బిస్‌ 5 కి అత్యంత ఆదరణ లభిస్తోంది.టీఆర్‌పీ కూడా అంతే స్పీడ్‌తో దూకుడు కొనసాగిస్తోంది.19మంది కంటెస్టంట్స్‌తో మొదలైన ఈ షో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది.ఒక సీజన్‌కి మించి మరో సీజన్‌ హిట్ మీద హిట్‌ కొడుతూనే ఉంది.

 Bigg Boss Telugu-5 Shanmukh Jaswanth Comments On Lobo And Umadevi Bigg Boss 5, S-TeluguStop.com

ఇక వివరాల్లోకి వస్తే ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రతీ సెలబ్రెటీ తమతమ మాటలతో, చేష్టలతో అటు ప్రేక్షకులను, ఇటు బిగ్‌బాస్‌ను మెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అందులో కొందరు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినట్టు కనిపిస్తుంది.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో చాలా మంది పాపులర్ సెలబ్రెటీలే.అందులో సోషల్ మీడియా ద్వారానోబుల్లితెరపైనో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లున్నారు.

దాంట్లో ఒకడైన షణ్ముఖ్ జస్వంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా హౌస్‌లోకి ప్రవేశించాడు.ఎపిసోడ్ ప్రారంభమై నాలుగు రోజులైనా స్క్రీన్ స్పేస్ లేకపోవడంతో షణ్ముక్ అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు.

తాజా బిగ్‌బాస్‌ ఇచ్చిన శక్తి చూపరా డింభకా అనే టాస్క్‌తో సిరి హన్మంత్ విజయం సాధించారు.ఆమె ఇచ్చిన టాస్క్‌లో భాగంగా షణ్ముక్ ఓనర్‌గా, లోబో సర్వెంట్‌గా నడుచుకోవాలి.దీంతో షణ్ముక్‌కి కొంత స్క్రీన్‌ స్పేస్‌ను వాడుకునే టైం వచ్చింది

Telugu Bigg Boss, Lobo, Reality Show, Tollywod, Umadevi-Movie

ఇదిలా ఉండగా హౌస్‌లోని కంటెస్టెంట్ల గురించి సిరి, కాజల్ దగ్గర ఓపెన్ అయిన షణ్ముఖ్.ఉమాదేవి తనతో మాట్లాడడం లేదని తనపై ఆమె చాలా కోపంగా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు.అంతేకాదు, వాస్తవానికి ఆమెను మొన్న నామినేట్ చేయ్యాలనుకున్నాతన తల్లి పేరు కూడా అదే (ఉమ) కావడంతో వదిలేశానని వివరణ ఇచ్చాడు.ఇక, వచ్చే వారం షణ్ముక్‌, ఉమను నామినేట్ చేస్తారా, లేదా అనేది చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube