కాజల్ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణాలివే?

బిగ్ బాస్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, మరి కొందరికి ఇష్టం ఉండదు, కానీ బిగ్ బాస్ అంటే మాత్రం ఆర్జె కాజల్ కు పిచ్చి.ఆ పిచ్చి తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.

 Bigg Boss Telugu 5 Reasons Behind Rj Kajal Elimination, Kajal, Eliminate, Bigg B-TeluguStop.com

హౌస్ లో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఎక్సైట్ అవుతూ, బిగ్ బాస్ తన పేరుని పిలిస్తే పరవశించిపోయింది.బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో నిలవాలి అన్న ఆమె కోరిక కలగానే మిగిలిపోయింది.

బిగ్ బాస్ పట్ల ఆమెకు ఉన్న అతి ప్రేమనే ఆమెను 14 వ వారం ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.తాజాగా 14 వ వారం ఎలిమినేషన్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

టాప్ సిక్స్ కంటెస్టెంట్ లలో నుంచి కాజల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఈ వారం కాజల్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం మిగతా వారితో పోల్చుకుంటే ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ తక్కువే అని చెప్పవచ్చు.

అంతే కాకుండా వారందరితో పోలిస్తే కాజల్ టాస్క్ లో వెనకబడింది అని చెప్పుకోవచ్చు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె రెండు మూడు వారాల్లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

అలా చివరికి 14 వారాలు హౌస్ లో ఉండగలిగిన కూడా ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయింది.అయితే బిగ్ బాస్ షో కి రాకముందు కాజల్ గత సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా రివ్యూలు కూడా ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లో ఆమెకు ఎప్పుడు ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకొని వచ్చిందని అందరూ భావించారు.

ఆమె మాట్లాడినా, ఏం చేసినా కూడా అదంతా గేమ్‌లో భాగమనే నిర్ణయానికి వచ్చారు.

Telugu Eliminate, Kajal, Rj Kajal-Movie

ప్రతి విషయంలో తలదూర్చి ఆ గొడవ పెద్దది చేయడం, అలాగే ప్రతి ఒక్క విషయానికి ఎక్సైట్ అవడంతో, నాగిణి, అని మ్యారేజ్‌ బ్యూరో అని ఇలా రకరకాల బిరుదులు ఇచ్చారు.దాదాపుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో కాజల్ గొడవ పడింది.హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఎంతోమంది హౌస్‌మేట్స్‌ కాజల్‌తో మాకు కనెక్షన్‌ లేదని తెగేసి చెప్పారు.

ఇలా మొదటి నుంచి ఆమె నెగెటివిటీని మోస్తూనే వచ్చింది.ఇక అనీ మాస్టర్, కాజల్ గొడవలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా ఇవన్నీ కూడా కాజల్ కు మైనస్ గా నిలిచాయి.అందువల్లే ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube