మాట్లాడను అంటూనే హగ్గులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఇదేందయ్యా అంటూ నెటిజన్స్ ఫైర్?

బిగ్ బాస్ షో చూస్తుండగానే 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారం లోకి అడుగుపెట్టింది.చివరి దశకు చేరుకోవడానికి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది.

 Bigg Boss Telugu 5 Priyanka Singh Manas Fight Ends With Hugs Details, Manas, Pr-TeluguStop.com

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరిగింది.

ఇలా ఉంటే ప్రియాంక, మానస్ లు పక్కనే కూర్చుని ఉంటారు.అప్పుడు మానస్ నిన్ను ఎవరు సపోర్ట్ చేశారు పింకీ అని అడగగా నువ్వు అని సమాధానం ఇచ్చింది.

నీకు సపోర్ట్ చేసింది సన్నీ, కాజల్ ఈ ఇద్దరు నీకు సపోర్ట్ చేశారు అని మానస్ చెప్పాడు.కాజల్ నిన్ను సపోర్ట్ చేసింది కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్ గా అనుకోలేదు కాబట్టి నామినేట్ చేశారు అంటూ మానస్ అసహనం వ్యక్తం చేశాడు.

పింకీ, మానస్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడినుంచి మానస్ వెళ్ళిపోతూ నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అని వెళ్ళిపోతాడు.అనంతరం మానస్ ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అయింది పింకీ.

నీతో మాట్లాడాలని ప్రియాంక అనగా.ఇప్పుడు నీతో మాట్లాడను అని మానస్ అనగా.

వెంటనే పింకీ ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధ పడతాను అని గట్టిగా అరవగా.ఎందుకు బాధ పడతావని మానస్ అడగగా ఒళ్ళు కొవ్వెక్కి అని సమాధానమిచ్చింది పింకీ.

నువ్వు నన్ను తప్పుగా ప్రూవ్ చేయాలని చూస్తున్నావ్ అంటూ మానస్ అనడంతో.అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పింకీ.

Telugu Bigg Boss, Hugs, Kajal, Manas, Pinky, Priyanka, Sunny-Movie

ప్రియాంక, మానస్ ల మధ్య గొడవలు కాజల్ ఎంట్రీ ఇవ్వడంతో అది మరింత పెద్దగా అయింది.అప్పుడు పింకీ ఎంట్రీ ఇచ్చి కాజల్ షటప్ అని తిట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయనేది నిజమే అంటూ ఆమెపై ఫైర్ అయ్యింది.సీన్ కట్ చేస్తే ప్రియాంక భోజనం చేయలేదని తెలిసిన మానస్ పింకీ ని తినమని బ్రతిమిలాడాడు.వెంటనే పింకీ మానస్ ని హగ్ చేసుకుని ఏడ్చేసింది.ఇలా మాట్లాడను అంటూనే ఇద్దరూ హగ్ చేసుకోవడంతో.ఇదేందయ్యా వీరి వ్యవహారం అంటూ నెటిజన్లు పెద్దఎత్తున వీరి వ్యవహారం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube