అసభ్యంగా తాకాడు.. అందుకే వెంటనే ఆ పని చేశానంటున్న ప్రియాంక !

అప్పటివరకు ఎంత సాన్నిహిత్యంగా మెలిగినా… ఆ ఒక్క సందర్భం వచ్చేసరికి.అక్కడి వాతావరణమే మారిపోతుంది.

 Bigg Boss Telugu 5 Priyanka Singh Feels Lobo Behave Indecent Her-TeluguStop.com

అదే బిగ్ బాస్ షో వారం వారం వచ్చే నామినేషన్ ప్రక్రియ.షో ఇప్పుడే మూడో వారంలో అడుగు పెట్టింది.

గత వారం జరిగిన హౌజ్ నుంచి ఉమ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకుందాం.

 Bigg Boss Telugu 5 Priyanka Singh Feels Lobo Behave Indecent Her-అసభ్యంగా తాకాడు.. అందుకే వెంటనే ఆ పని చేశానంటున్న ప్రియాంక -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హౌస్ లో రవి, ప్రియా, లహరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది.యాంకరింగ్‌ కోసం లహరి ట్రై చేస్తుందని.అందుకని తనతో ఉంటుంది.కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట’ అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది.ఇందులో నిజమెంతుందో తెలుసుకుందామని రవితో మాట్లాడింది లహరి.‘నేను యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు.తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?’ అని లహరి, రవిని నిలదీసింది.దీనికి రవి అడ్డంగా తలూపుతూ అబ్బే ఆ మాటే అనలేదని మాట మార్చేశాడు.కానీ ప్రియ మాత్రం.‘లహరి సింగిల్‌గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది.నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు’ అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది.అయితే రవి మాత్రం తను ఆ మాటే అనలేదని కరాఖండిగా చెప్పాడు.“నిజంగానే నువ్వు ఆ మాట అన్నావు బ్రో..

అది నేను విన్నాను” అంటూ ప్రియ ఏడ్చేసింది.

Telugu Bigg Boss Telugu 5, Indicent Behave, Lobo, Priyanka Singh-Movie

ఇదిలా ఉండగా.లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కాజల్‌, సిరి దగ్గర వాపోయింది ప్రియాంక సింగ్.‘నిన్న హాఫ్‌ ఫిట్‌ డ్రెస్‌ వేసుకున్నాను.అది కొంచెం అన్‌ కంఫర్టబుల్‌గా అనిపించింది.కానీ వీలైనంతవరకు కవర్‌ చేసుకుంటూనే ఉన్నానని.అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడని, అయినప్పటికీ కవరింగ్‌ చేసుకుంటున్నానని ప్రియాంక చెప్పింది.అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడని… లోబో అలా చేయడంతో దానిని సరదాగా తీసుకొని వెంటనే డ్రెస్‌ మార్చేసుకున్నాను’ అని ఆమె వాపోయింది.

ఇది విని షాకైన కాజల్‌ లోబోకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది.పక్కనే ఉన్న సిరి.

ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని వారికి చెప్పింది.అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్‌ హగ్‌ ఇచ్చి వెళ్లాడు.

ఇలా నిత్యం హౌస్లో పోట్లాటలు, గొడవలతో హౌస్ వాతావరణం వేడెక్కిపోతోంది.

#Lobo #Behave #Priyanka Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు