నటరాజ్ మాస్టర్ లవ్ స్టోరీ.. ఆ సమయంలో భార్య లేకపోతే ఆయన పరిస్థితే వేరు?

తనకున్న అద్భుత టాలెంట్ తో ఓ ట్రెండ్ సృష్టిస్తున్నారు కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్.ఆయన డ్యాన్స్ చేస్తే ఆ నటరాజ స్వామే భూమి మీదకొచ్చి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని చాలా మంది కూడా అంటుంటారు.

 Bigg Boss Telugu 5 Natraj Master Emotional Love Story-TeluguStop.com

డిజిటల్ వరల్డ్ అంతగా పరిచయం లేనప్పటి కాలంలోనూ ఆయన తన డ్యాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను అలరించేవారు.జీవితంలో మనం ఎదిగేకొద్దీ ఎన్ని ఆటంకాలు వచ్చినా.

వారందరికీ మన పనితోనే, మన టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలని ఆయన అంటుంటారు.ఒకప్పుడైతే ఎవరైనా అలా అడ్డొస్తున్నారని తెలిస్తే ఏమీ ఆలోచించకుండా కొట్టేసేవారట.

 Bigg Boss Telugu 5 Natraj Master Emotional Love Story-నటరాజ్ మాస్టర్ లవ్ స్టోరీ.. ఆ సమయంలో భార్య లేకపోతే ఆయన పరిస్థితే వేరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు మాత్రం అలాంటి ధోరణి లేదని ఆయన అంటుంటారట.

ఈ విధంగా నటరాజ్ మాస్టర్ ప్రవర్తనలో మార్పు రావడానికి కారణం ఆయన సతీమణి నీతూ అని ఆయన గర్వంగా చెప్పుకుంటారట.

నిజంగా నీతు తన జీవిత భాగస్వామిగా దొరకటం తన అదృష్టంగా భావిస్తానని నటరాజ్ మాస్టర్ అంటుంటారట.తాను బిజీగా గడుపుతూ ఉన్న సమయంలో నీతు తనను ప్రేమిస్తుందని తెలిసినా పట్టించుకోలేదట.

అలా దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఓ వాలెంటైన్‌ డే రోజు ఆమె ప్రేమకు ఓకే చెప్పారట నటరాజ్ మాస్టర్.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 5 కి నటరాజ్ మాస్టర్ వెళ్లారు.అప్పటికే ప్రెగ్నెంట్‌గా ఉన్న నీతూ ఆయన అలా వెళ్లాలని తెలియగానే చాలా ధైర్యం చెప్పి మాస్టర్‌ని హౌజ్‌లోకి పంపించారట.ఇప్పటి వరకు నీకు సంబంధించిన అన్ని కష్టాల్లోనూ ఉన్నానని.

ఇప్పుడు కూడా తనకు సపోర్టుగా నిలుస్తానని చెప్పి ఆమె నటరాజ్‌ మాస్టర్‌ను బిగ్ బాస్ కు పంపించారట.ఇలా నటరాజ్ మాస్టర్ జీవితంలో తన భార్య పాత్ర ఎంతో ఉందని ప్రస్తుతం తను ఈ పొజిషన్లో ఉండటానికి తన భార్య కారణమని తన జీవితంలో నీతూ లేకపోతే తన పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఓ సందర్భంలో నటరాజ్ మాస్టర్ తన భార్య గురించి వెల్లడించారు.

#Interview #Biggboss #Biggboss #Biggboss #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు