ఈసారి ఎలిమినేషన్ పక్క.. ఎవరు కాపాడలేరట!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.ఇప్పటికి ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 8వ వారం కొనసాగుతోంది.

 Bigg Boss Telugu 5 Lobo May Be Eliminate 8th Week Bigg Boss Telugu 5, Lobo, Big-TeluguStop.com

ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా రవి, షణ్ముఖ, మానస్, శ్రీ రామచంద్ర, లోబో, సిరి ఉన్నారు.

నామినేషన్ లిస్టులో ఉన్న వీరిలో ఈ వారం నామినేట్ అయ్యేది ఎవరూ అంటూ అప్పుడే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనే విషయాన్ని తెలియ జేస్తున్నారు.

నామినేషన్ లిస్టులో ఉన్న రవి, షణ్ముక్, మానస్, శ్రీ రామ్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సిరి లోబో మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ కాగా ఆరు మంది లేడీ కంటెస్టెంట్ బయటకు పంపించడంతో మహిళల పట్ల బిగ్ బాస్ పక్షపాతం చూపుతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu Bigg Boss, Eliminate, Lobo, Ravi, Shanmukh, Siri, Sriram-Movie

ఈ క్రమంలోనే ఏడు మంది కంటెస్టెంట్ లో ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు వెళ్లిపోవడంతో కార్యక్రమానికి గ్లామర్ తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఈ వారం సిరిని కాకుండా హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వారం లోబో పక్క ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమయ్యాయి కనుక ఈ వారం లోబో ఎలిమినేట్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వారం లోబో ఎలిమినేట్ అవుతాడా లేదా తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube