బిగ్ బాస్ షో మూడు వారలకుగాను లహరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ 5 లోకి లేడీ అర్జున్ రెడ్డిగా ఎంటరైన లహరి మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఎవరు ఊహించని విధంగా లహరి షారి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను కొంతమేర ఆశ్చర్యానికి గురి చేసింది.

 Bigg Boss Telugu 5 Lahari Shari Remuneration Bigg Boss Show-TeluguStop.com

అసలు ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు రావడానికి గల కారణం రవి అని నెటిజన్లు భావిస్తున్నారు.రవి -ప్రియా- లహరి మధ్య జరిగిన గొడవలు కారణంగా లహరి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

మూడు వారాల పాటు సభ్యులతో పలు విషయాలలో గొడవలు పడి, అర్జున్ రెడ్డి బామ అనిపించుకున్న ఈమె మూడు వారాల తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.అయితే మూడు వారాలకు కలిపి ఈమె ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Bigg Boss Telugu 5 Lahari Shari Remuneration Bigg Boss Show-బిగ్ బాస్ షో మూడు వారలకుగాను లహరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bigg Boss, Bigg Boss 5 Telugu, Lahari, Remunaration-Movie

ఈ క్రమంలోనే లహరి మూడు వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసినందుకు గాను ఈమెకు వారానికి లక్ష నుంచి రెండు లక్షలలోపు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మూడు వారాలకు కలిపి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.వెండితెరపై అర్జున్ రెడ్డి, జాంబి రెడ్డి వంటి సినిమాలలో సందడి చేసిన లహరి వెండితెరపై సరైన గుర్తింపు సంపాదించుకోలేక పోయింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకోవాలనుకున్న ఈమె మూడవ వారం ఎలిమినేట్ కావడం గమనార్హం.

#Bigg Boss #Bigg Boss #Lahari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు