ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. పింకీ, కాజల్?

Bigg Boss Telugu 5 Kajal Priyanka Singh Are Danger Zone 13th Week

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది.దీనితో కంటెస్టెంట్ ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.19 మందితో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలారు.ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటిపడుతున్నారు.ఇప్పటికే హౌస్ లో షణ్ముఖ్, సన్నీల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.

 Bigg Boss Telugu 5 Kajal Priyanka Singh Are Danger Zone 13th Week-TeluguStop.com

ఇక ఈ వారం నామినేషన్ లో షణ్ముక్, సన్నీ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు.ఇక వీరిలో శ్రీరామ్ అత్యధిక ఓట్లతో ముందువరుసలో దూసుకుపోతున్నాడు.

ఒకవైపు శ్రీరామ్ తెలివిగా గేమ్ పై ఫోకస్ పెడుతూ ఆడుతుంటే, మానస్ కూడా కేవలం గేమ్ పైన దృష్టి పెడుతూ తనకు అత్యధిక ఓట్లు పడేలా జాగ్రత్త పడుతున్నాడు.మిగిలిన కంటెస్టెంట్ లు సిరి, కాజల్, ప్రియాంక.

 Bigg Boss Telugu 5 Kajal Priyanka Singh Are Danger Zone 13th Week-ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. పింకీ, కాజల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  అయితే గత వారంలోనే ఈ ముగ్గురు నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు.

Telugu Eliminate, Kajal, Priyanka-Movie

కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ ముగ్గురు కంటెస్టెంట్ లో కాకుండా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ప్రియాంక కాకుంటే కాజల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈవారం వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు.ఎందుకంటే గత వారం ఎవరు ఊహించని విధంగా యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడంతో ఈ వారం వీరిద్దరిలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

#Eliminate #Priyanka #Kajal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube