రవి డేంజర్.. అతనికి దూరంగా ఉండండి!

బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం ఆరు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ కార్యక్రమం ఆరు వారాలకు గానీ ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ వారం శ్వేత వర్మ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.హౌస్ నుంచి శ్వేత వర్మ ఎలిమినేట్ కావడంతో ఈమె హౌస్ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ స్టేజ్ పైకి వచ్చింది.

 Bigg Boss Telugu 5 Eliminated Contestant Swetha Varma Warns Housemates-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన శ్వేత వర్మతో హోస్ట్ నాగార్జున సైన్ గేమ్ ఆడించారు.ఈ క్రమంలోనే శ్వేతా వర్మ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ రవి చాలా స్మార్ట్ అని కానీ అతడికి దూరంగా ఉండటం మంచిదని తెలిపింది.అదేవిధంగా అని మాస్టర్ తక్కువ మాట్లాడుతూ గేమ్ ఆడాలని సూచించింది.

 Bigg Boss Telugu 5 Eliminated Contestant Swetha Varma Warns Housemates-రవి డేంజర్.. అతనికి దూరంగా ఉండండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Anchor Ravi, Bigg Boss Telugu 5, Eliminate, Swetha Varma-Movie

అయితే గతవారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి శ్వేతా వర్మ బీబీ ఫ్యాక్టరీ నుంచి బొమ్మల తయారీ టాస్క్ లో భాగంగా రవి టీంలో ఉంది.రవి చేసిన పనికి శ్వేతా వర్మకు శిక్ష పడటం ఆమె వరెస్ట్ పర్ఫార్మర్ గా జైలుకు వెళ్లడంతో ఆమెపై ఎక్కువగా నెగిటివిటీ ఏర్పడిందని అందుకోసమే తనకు ఓట్లు తక్కువ పడటం వల్ల తాను ఎలిమినేషన్ కు గురి అయిందని తెలుస్తోంది.ఇలా రవి చేసిన పనికి శిక్ష అనుభవించిన శ్వేతా వర్మ రవికి దూరంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది.

#Swetha Varma #Anchor Ravi #Eliminate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube