సొంత వైద్యం అక్కర్లేదంటూ ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss Telugu 5 Bigg Boss Warns Priyanka Singh

బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 13వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది.

 Bigg Boss Telugu 5 Bigg Boss Warns Priyanka Singh-TeluguStop.com

రెండు రోజులలో ఈ 13వ వారం కూడా ముగియనుంది.ఇక ఎప్పటిలాగే వీకెండ్ దగ్గరపడుతుండటంతో హౌస్ మేట్స్ లో టెన్షన్ మొదలైంది.

కంటెస్టెంట్ లతో పాటుగా, ప్రేక్షకులకు కూడా ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉంది అని ప్రియాంక సింగ్ అభిప్రాయపడింది.

 Bigg Boss Telugu 5 Bigg Boss Warns Priyanka Singh-సొంత వైద్యం అక్కర్లేదంటూ ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం మానస్ కూడా వెళ్ళవచ్చు అన్న అనుమానం వ్యక్తం చేశాడు.అనఫిషియల్ పోలింగ్ చూస్తుంటే ప్రియాంక చెప్పిన మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా కొన్ని శబ్దాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుసక్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటించారు.ఈ క్రమంలోనే కాజల్ పదేపదే మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ, కాజల్ పై ఫైర్ అయ్యాడు.

ఈ టాస్క్ లో ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో శ్రీ రామ్, తర్వాతి స్థానంలో సిరి నిలిచారు.

Telugu Priyanka-Movie

ఇక సిరికి మోషన్స్ అవుతున్నాయి ఆరోగ్యం బాగాలేదు అనగానే అప్పుడు ప్రియాంక షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని సలహాలు ఇచ్చింది.అయితే ఇప్పటికే పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్ కే పరిమితమయ్యాడు.ఇక సిరి విషయంలో కూడా వైద్య సలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్ బాస్ నీకోసం కానీ, ఇంటి సభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు.

దీంతో పింకీ ఒక్కసారిగా తనకు అవమానం జరిగినట్లు ఫీల్ అయ్యింది.

#Priyanka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube