గుడ్‌ న్యూస్‌ : బిగ్‌బాస్‌ 3 అధికారిక ప్రకటన వచ్చేసింది, ప్రారంభం ఎప్పుడంటే..!  

Bigg Boss Telugu 3 Official Announcement-bigg Boss Telugu 3,hema Chandra,nagarjuna,sru Mukhi,star Maa,varun Sandesh,బిగ్‌బాస్‌ 3

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా హోస్ట్‌ ఎవరు, పార్టిసిపెంట్స్‌ ఎవరు అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. రికార్డు స్థాయిలో మొదటి రెండు సీజన్‌లు టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకున్న నేపథ్యంలో మూడవ సీజన్‌ను అంతకు మించి ఆసక్తికరంగా మార్చేందుకు గత మూడు నాలుగు నెలలుగా చర్చలు జరిపిన నిర్వాహకులు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు..

గుడ్‌ న్యూస్‌ : బిగ్‌బాస్‌ 3 అధికారిక ప్రకటన వచ్చేసింది, ప్రారంభం ఎప్పుడంటే..!-Bigg Boss Telugu 3 Official Announcement

మాటీవీ అధికారికంగా సీజన్‌ 3కి సంబంధించిన లోగో వీడియోను విడుదల చేయడం జరిగింది. అతి త్వరలోనే బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. గతంలో అధికారిక ప్రకటన వచ్చిన నెల నుండి నెలన్నర లోపులో షో ప్రారంభం అయ్యింది. అంటే ఈసారి కూడా జులై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే నాగార్జున హోస్ట్‌గా ఎంపిక అయ్యాడని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని ఒకటి రెండు వారాల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఇక ఈ సీజన్‌లో పార్టిసిపెంట్స్‌ ఎవరు అనే విషయంపై కూడా అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి, ఉదయభాను, వరుణ్‌ సందేశ్‌, హేమ చంద్ర, వైవా హర్ష, ఉప్పల్‌ బాలు ఇంకా కొందరు బుల్లి తెర నటీనటులు కూడా కనిపించబోతున్నారు.

ఈసారి సెలబ్రెటీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మరో వైపు గేమ్‌లో పలు మార్పులు చేర్పులు చేశారని, ప్రేక్షకులను ప్రతి నిమిషం కూడా ఎంటర్‌టైన్‌ చేసేందుకు కొత్త గేమ్స్‌ను ఆడించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇది బుల్లి తెర ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.