బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ..! వైరల్ అవుతున్న దృశ్యాలు..!   Bigg Boss Telugu 2 Fame Bhanu Sri To Act In U Grade Movie     2018-10-31   10:44:51  IST  Sainath G

డాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భాను శ్రీ.. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ‘బాహుబలి 2’ చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి సన్నని శరీరాకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ. అయితే ఇది తెరవెనుక జరిగిన ముచ్చట కాబట్టి బాహుబలిలో నటించాను అన్న పేరు తప్పితే.. ఆమెను ఏవిధంగాను సహాయపడలేకపోయింది. అయితే నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వెండి తెర నటి.

బిగ్ బాస్‌లో ఉన్న కొన్ని రోజులు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కౌశల్ తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె చేసిన రచ్చతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె హస్కీ గొంతుకు, తెలంగాణ యాసకు హోస్ట్ నాని కూడా ఫిదా అయ్యాడు. ఇక బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన భాను శ్రీకి మంచి అవకాశాలే వస్తున్నాయి. ఈటీవీలో ప్రసారం అయ్యే ఫేమస్ డాన్స్ షో ‘ఢీ 11’లో యాంకర్ రష్మి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ టీం లీడర్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా భానుశ్రీ తాజాగా నటించిన ఏడూ చేపల కథ అనే చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, Rx 100 లాంటి చిత్రాల్లో మద్దు సీన్లు హద్దులు దాటినా తెలుగు ప్రేక్షకులు శెభాష్ అనడంతో మేకర్స్ అటువైపుగా ఆరబోతలు, ముద్దుసీన్లు, రొమాన్స్‌కి అగ్రపీఠం వేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఏడు చేపల కథ’ టీజర్ పోర్న్ వీడియోలను తలదన్నేలా మసాలా దట్టించి వదిలారు. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలు ఇందులో చాలా ఉన్నాయ్..కామంతో తహ తహలాడిపోయే రవి అనే వ్యక్తి కథే ఈ ‘ఏడు చేపలు కథ’. ఇతడికి ఓ వీక్ నెస్ ఉంటుంది. మనోడికి కాస్త ఎక్స్ పోజ్ చేస్తూ ఎవరైనా కంట పడితే.. అసలు కంట్రోల్ చేసుకోలేడు. టెంప్ట్ అయిపోయి వాళ్లతో రతిక్రీడల్లో ఆరితేరిపోతుంటారు. ‘నా ముందు ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’.. అంటూ తనకు చిక్కిన ‘ఏడు చేపల కథా’ కార్యక్రమాలను పూసగుచ్చినట్టు డాక్టర్‌తో చెప్పుకొస్తున్నాడు టెంప్ట్ రవి.

Bigg Boss Telugu 2 Fame Bhanu Sri To Act In U Grade Movie-

ఈ చిత్రంలో భానుశ్రీ కూడా ఓ పాత్రలో నటిస్తోంది. సెక్సీ సీన్స్ లో భానుశ్రీ రెచ్చిపోయి నటించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చాలా మంది నటీమణులు బోల్డ్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్ షోకు తెరలేపుతున్నారు. రష్మీ కూడా గుంటూరు టాకీస్ లాంటి చిత్రంలో నటించి హీరోయిన్ గా మారింది. అదే తరహా ఇమేజ్ భానుశ్రీకి కూడా దక్కుతుందేమో చూడాలి. ఈ ‘ఏడు చేపలు కథ’ టీజర్‌లోని ఓ సన్నివేశంలో టీ షర్ట్‌ను తొలగిస్తూ ఉన్న బోల్ట్ సీన్లో నటించింది భాను శ్రీ. నిజానికి ఇందులో నటించిన మిగతా హీరోయిన్లు టాప్ లెస్‌లో కనిపించి కాక రేపారు. అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్రానికి సామ్ జె చైతన్య దర్శకత్వం వహించగా.. చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు.