బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలిస్తే వాళ్ల కెరీర్ ఢమాల్.. బిందు పరిస్థితి అంతేనా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోకు ఒక ప్రత్యేకత ఉంది.బిగ్ బాస్ షోకు విజేతగా నిలిస్తే ఆ కంటెస్టెంట్ కు తర్వాత పెద్దగా ఆఫర్లు రావని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

 Bigg Boss Show Winner Sentiment Goes Viral In Social Media Details Here , Bigg Boss Show , Madanapalle In Chittoor District , Shivabalaji, Kaushal, Rahul Sipliganj, Abhijit, Sunny,bigg Boss Show Winner , Social Media , Bindumadhavi , Negative Sentiment , Bigg Boss Nonstop-TeluguStop.com

బిగ్ బాస్ షో తెలుగు సీజన్1 విన్నర్ శివబాలాజీ కాగా బిగ్ బాస్ సీజన్2 కు కౌశల్ మండా విన్నర్ గా నిలిచారు.బిగ్ బాస్ సీజన్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కాగా బిగ్ బాస్ సీజన్ 4కు అభిజిత్ విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ సీజన్5 తెలుగు విన్నర్ గా సన్నీ నిలవడం గమనార్హం.

 Bigg Boss Show Winner Sentiment Goes Viral In Social Media Details Here , Bigg Boss Show , Madanapalle In Chittoor District , Shivabalaji, Kaushal, Rahul Sipliganj, Abhijit, Sunny,bigg Boss Show Winner , Social Media , BinduMadhavi , Negative Sentiment , Bigg Boss Nonstop-బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలిస్తే వాళ్ల కెరీర్ ఢమాల్.. బిందు పరిస్థితి అంతేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షోకు విజేతలుగా నిలిచిన ఈ కంటెస్టెంట్లలో ఒక్క కంటెస్టెంట్ కూడా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

ఒక్క కంటెస్టెంట్ కు కూడా వరుసగా సినిమా ఆఫర్లు రాలేదు.అయితే బిందు మాధవి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.తెలుగు, తమిళ భాషల్లోని సినిమాలలో ఎక్కువగా నటించిన బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన యువతి కావడం గమనార్హం.

బయో టెక్నాలజీలో డిగ్రీ చదివిన బిందు మాధవి కొన్ని యాడ్స్ లో మోడల్ గా నటించడం గమనార్హం.

తనిష్క్ యాడ్ ద్వారా బిందు మాధవికి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆవకాయ్ బిర్యానీ సినిమాలో నటించే అవకాశం దక్కింది.ట్రెడిషనల్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించడం, తెలుగమ్మాయి కావడం వల్లే ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని అభిమానులు భావిస్తున్నారు.

Telugu Abhijit, Bigg Boss Show, Bindumadhavi, Kaushal, Rahul Sipliganj, Shivabalaji, Sunny-Movie

పిల్ల జమీందార్ సినిమా తర్వాత బిందు మాధవి పూర్తిగా కోలీవుడ్ సినిమాలకు పరిమితమయ్యారు.బిందు మాధవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో ఆమెకు ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే ఆమె కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube