నాగార్జున పరువు తీస్తున్న బిగ్ బాస్.. ఏం జరిగిందంటే..?  

bigg boss show season 4 got poor trp rating, bigg boss show, bigg boss4, TRP Ratings, nagarjuna, samantha, star maa, bigg boss4 contestants - Telugu Bigg Boss 4, Bigg Boss Show, Bigg Boss Show Season 4 Got Poor Trp Rating, Bigg Boss Trp Ratings, Bigg Boss4 Contestants, Hyderabad Barc Ratings, Nagarjuna, Samantha, Star Maa, Trp Ratings

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాగార్జున పరువు తీస్తోందా.? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇప్పటివరకు బుల్లితెరపై నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ 3 ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి.అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ షో రేటింగులు చూసి ఆయన అభిమానులు అవాక్కవుతున్నారు.
బిగ్ బాస్ షో ఆరో వారం రేటింగ్స్ గురువారం విడుదల కాగా హైదరాబాద్ బార్క్ రేటింగ్ కేవలం 3.73 అంటే బిగ్ బాస్ షో పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.నాగార్జున హోస్ట్ చేసిన వీకెండ్ ఎపిసోడ్లకు ఆరుకు అటూఇటుగా రేటింగ్ రాగా వీక్ డేస్ రేటింగులు బిగ్ బాస్ నిర్వాహకులను సైతం నిరాశపరుస్తున్నాయి.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో రేటింగులు భారీగా తగ్గడం గమనార్హం.
ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోని సీరియళ్ల రేటింగులే బిగ్ బాస్ షో రేటింగు ల కంటే మెరుగ్గా ఉన్నాయి.కంటెస్టెంట్ల ఎంపికలో లోపాలు.

TeluguStop.com - Bigg Boss Show Season 4 Got Poor Trp Rating

అర్థంపర్థం లేని లవ్ ట్రాకులు, రిపీట్ అవుతున్న టాస్కులు, ఊహించని కంటెస్టెంట్ల ఎలిమినేషన్లు, ఆరోగ్య సమస్యల వల్ల వెళ్లిపోతున్న కంటెస్టెంట్లు ఇలా బిగ్ బాస్ షో రేటింగులు తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.కంటెస్టంట్ల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

గత సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు బిగ్ బాస్ కు ప్లస్ అయినా ఈ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల బిగ్ బాస్ షోకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోపై ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

TeluguStop.com - నాగార్జున పరువు తీస్తున్న బిగ్ బాస్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత వారం వీకెండ్ ఎపిసోడ్ ను సమంత హోస్ట్ చేయగా ఈ వారం మాత్రం బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్లకు నాగార్జునే హాజరు కానున్నాడని సమాచారం.

#BiggBoss4 #Bigg Boss 4 #Nagarjuna #BiggBoss #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Show Season 4 Got Poor Trp Rating Related Telugu News,Photos/Pics,Images..