బిగ్ బాస్ షో కు సమంత పారితోషికం ఎంతంటే..?  

bigg boss show samantha remuneration details , bigg boss show samantha , Samantha Remuneration, Nagarjuna, Samantha Host, Wild dog shooting - Telugu Bigg Boss Show, Bigg Boss Show Samantha, Bigg Boss Show Samantha Remuneration Details, Nagarjuna, Samantha, Samantha Host, Samantha Remuneration, Wild Dog Shooting

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో దసరా పండుగ రోజున సమంత సందడి చేయనున్నారు.మామ నాగార్జున మనాలీలో షూటింగ్ తో బిజీగా ఉండటంతో కోడలు పిల్ల సమంత షోను హోస్ట్ చేయనున్నారు.

TeluguStop.com - Bigg Boss Show Samantha Remuneration Details

కెరీర్ మొదటి నుంచి సినిమాలకే పరిమితమైన సమంత ఇలా ఒక షోకు హోస్ట్ గా కనిపించడం ఇదే తొలిసారి.ఇప్పటికే స్టార్ మా ఛానెల్ సమంతకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది.
రంగస్థలం లోని పాటతో ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రోమోతోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.ఈరోజు టెలీకాస్ట్ కాబోయే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.వెండితెరపై హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న సామ్ బిగ్ బాస్ షో హోస్టింగ్ తో బుల్లితెరపై కూడా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టనున్నారు.అయితే బిగ్ బాస్ షోకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది.? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.
సాధారణంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లు రెండు రోజులు ఉంటాయి.

అయితే నిన్నటి ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే ప్రసారమైంది.ఈరోజు మాత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు బిగ్ బాస్ షో ప్రసారం కానుంది.

TeluguStop.com - బిగ్ బాస్ షో కు సమంత పారితోషికం ఎంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాదాపు మూడు గంటల షో కావడంతో నాగార్జున రెండు ఎపిసోడ్లకు తీసుకునే మొత్తాన్ని సమంతకు చెల్లించనున్నారని సమాచారం.పారితోషికం విషయంలో సమంత కూడా పెద్దగా పట్టింపులకు పోదు.
మరోవైపు బిగ్ బాస్ షోకు వీకెండ్ స్థాయిలో వీక్ డేస్ ఎపిసోడ్లపై ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.మరి సమంత హోస్టింగ్ తో బిగ్ బాస్ రేటింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి దివి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ వల్ల ఈ విషయం తెలిసింది.

#Samantha #Samantha Host #Nagarjuna #BiggBoss #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Show Samantha Remuneration Details Related Telugu News,Photos/Pics,Images..