బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో..?  

bigg boss show final episode date fixed,bigg boss 4, december 20, final episode date fixed, young star hero - Telugu Bigg Boss 4, December 20, Final Episode Date Fixed, Young Star Hero

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ముగింపుకు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది.ఆశించిన స్థాయిలో రేటింగ్ రాకపోయినా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ షోపై ఆసక్తి చూపుతున్నారు.

TeluguStop.com - Bigg Boss Show Final Episode Date Fixed

వీకెండ్లలో బిగ్ బాస్ షో రేటింగ్ 7 కంటే తక్కువగా ఉంటే వీక్ డేస్ లో 5 కంటే తక్కువగా ఉండటం గమనార్హం.కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సీజన్ లో బిగ్ బాస్ షోకు సరైన కంటెస్టెంట్లు దొరకలేదు.

అయితే బిగ్ బాస్ ఫినాలేకు టాలీవుడ్ హీరో గెస్ట్ గా రానున్నారని సమాచారం.

TeluguStop.com - బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలేకు చిరంజీవి గెస్ట్ గా రాగా సీజన్ 4కు యంగ్ స్టార్ హీరో రానున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు ప్రస్తుతం ఆ యంగ్ స్టార్ హీరోను సంప్రదిస్తున్నారని ఆ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని సమాచారం.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ఎలిమినేషన్ ఉంటే హౌస్ లోకి కుమార్ సాయి లేదా నోయల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు బిగ్ బాస్ విన్నర్ విషయంలో సోషల్ మీడియాలో కొందరు కంటెస్టెంట్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే షో పూర్తవడానికి మరో నాలుగు వారాల సమయం ఉన్న నేపథ్యంలో విన్నర్ ఎవరో ఇప్పుడే చెప్పలేమని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.గత సీజన్లలో అంచనాలకు భిన్నంగా బిగ్ బాస్ షో విన్నర్ ఎంపిక జరిగిందని ఈ సీజన్ లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు కూడా ఒక గెస్ట్ రానున్నారని సమాచారం.షో ముగియడానికి నాలుగు వారాలే ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ ఇకపై కఠినమైన టాస్కులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అభిజిత్ లేదా సోహైల్ లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

#December 20 #Bigg Boss 4 #FinalEpisode #Young Star Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Show Final Episode Date Fixed Related Telugu News,Photos/Pics,Images..