భారీగా తగ్గిన బిగ్ బాస్ రేటింగ్స్.. తల పట్టుకుంటున్న నిర్వాహకులు?

తెలుగులో భారీ అంచనాలతో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 రెండు వారాల క్రితం ప్రారంభమైంది.కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటం, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, విద్యార్థులు కూడా ఇళ్ల దగ్గరే ఉండటంతో గత సీజన్లతో పోలిస్తే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు అంచనా వేశారు.ఆ అంచనాలకు తగిన విధంగానే సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ 18.5 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

 Bigg Boss Second Week Trp Rating Average, Bigg Boss4, Nagarjuna, Trp Ratings, St-TeluguStop.com

తొలి వారం వీక్ డేస్ లో మాత్రం 8.15 రేటింగ్ తో సరిపెట్టింది.తొలివారం మోనాల్ ఏడుపులు, సరైన టాస్క్ లు లేకపోవడం వల్ల వీక్ డేస్ లో తక్కువ రేటింగ్ వచ్చినా రాబోయే వారాల్లో రేటింగ్ పుంజుకుంటుందని నిర్వాహకులు భావించారు.అయితే ఆ అంచనాలకు భిన్నంగా వీకెండ్స్ లోనూ, వీక్ డేస్ లోనూ రేటింగ్స్ విషయంలో బిగ్ బాస్ తీవ్రంగా నిరాశపరిచింది బిగ్ బాస్ షో రెండో వారం వీకెండ్ రేటింగ్ 10.7 కాగా వారం మొత్తం రేటింగ్ యావరేజ్ గా 8.05గా ఉంది.

ఈ రేటింగ్ స్టార్ మా ఛానెల్లో ప్రసారవుతున్న పలు సీరియళ్లతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం.మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో అవినాష్ పరవాలేదనిపిస్తున్నా కుమార్ సాయి మాత్రం అటు బిగ్ బాస్ నిర్వాహకులను, ఇటు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తూ ఉండటం గమనార్హం.

దీంతో ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వాహకులు స్వాతి దీక్షిత్ ను మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంట్లోకి పంపుతున్నారు.
ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో క్రికెట్ లవర్స్ బిగ్ బాస్ కంటే ఐపీఎల్ వైపే మొగ్గు చూపుతున్నారు.

దీంతో భవిష్యత్తులో రేటింగ్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.ప్రస్తుతం యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టుకుంటున్న బిగ్ బాస్ షో పుంజుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

మరో రెండు మూడు వారాల రేటింగ్స్ ను పరిశీలిస్తే బిగ్ బాస్ షో ఫైనల్ రిజల్ట్ పై ఒక అంచనాకు రావచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube