ఫేడ్‌ ఔట్‌ స్టార్స్‌ మాత్రమే ఓకే చెప్తున్నారట

హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారు ఎంతో మంది ఆ తర్వాత స్టార్స్‌ అయ్యారు.తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారు కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నారు.

 Bigg Boss Season4, Nagarjuna, Telugu Contestants, Bigg Boss4, Corona Effect, Big-TeluguStop.com

కాని తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్స్‌ పూర్తి అయితే అందులో ఒక్క రాహుల్‌ సిప్లిగంజ్‌ మినహా మరెవ్వరు కూడా అదనపు గుర్తింపు దక్కించుకోలేక పోయారు.కొందరు తమ క్రేజ్‌ కూడా కోల్పోయారు.

అందుకే తెలుగు బిగ్‌బాస్‌ అంటే కాస్త ఫేమ్‌ పేరు ఉన్న వారు ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు.

తెలుగు బిగ్‌బాస్‌ను అక్టోబర్‌ లేదా నవంబర్‌ నుండి ప్రారంభం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అందుకోసం చాలా మంది బుల్లి తెర వెండి తెర మీడియా రంగానికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు.అయితే ఎక్కువ శాతం క్రేజ్‌ ఉన్న వారు బాబోయ్‌ ప్రస్తుతానికి బిగ్‌బాస్‌ ఇంట్రెస్ట్‌ లేదని తప్పించుకుంటున్నారు.

ఏమాత్రం క్రేజ్‌ లేని వారు మాత్రం సరే చేస్తాం అంటూ ఎగబడుతున్నారు.మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కోసం కంటెస్టెంట్స్‌ కరువు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది.

Telugu Biggboss, Bigg Boss, Corona Effect, Nagarjuna, Telugu-Telugu Visual Story

అవకాశాలు లేని వారు అంతో ఇంతో పారితోషికం వస్తుందనే ఆశతో ఓకే చెప్తుండగా కొందరు మాత్రం ఇలా అయినా కాస్త గుర్తింపు వస్తుందేమో అనే ఆశతో వారి వెంట పడుతున్నారు.మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్‌ ఎంపిక విషయంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులకు కాస్త ఇబ్బందిగా మారింది.మరి ఎలాంటి సెలబ్రెటీలను ఈసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో చూడాలి.హోస్ట్‌గా ఎవరు చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది. నాగార్జున ఇప్పటికే ఓకే అన్నాడు.కాని కొందరు మాత్రం ఇంకా వేరే ప్రచారాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube