ఈ ముగ్గురికి బిబి4 లో బెర్త్‌ దాదాపుగా ఖరారు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.మొదటి మూడు సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

 Bigg Boss Season4, Bigg Boss4, Bithiri Satti, Sunitha, Tagubothu Ramesh, Bigg Bo-TeluguStop.com

అత్యంత జాగ్రత్తలు తీసుకుని మరీ ఈసారి బిగ్‌బాస్‌ షోను నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.ఈ సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా బిత్తిరి సత్తి దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాడు.

ఇక సింగర్‌ కోటాలో ఈ సీజన్‌లో సునీత ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కమెడియన్‌ కు కూడా ఛాన్స్‌ ఉంటుంది కనుక ఆ స్థానంలో తాగుబోతు రమేష్‌ ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ ముగ్గురితో పాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.నందు చాలా ఆసక్తిగా బిగ్‌బాస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.అయితే గీతా మాధురి ఇప్పటికే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.ఆమె భర్త అవ్వడం వల్ల నందుకు ఛాన్స్‌ ఉంటుందో లేదో అనేది చూడాలి.

యాంకర్‌ జాన్సీ పేరు కూడా ఈసారి ప్రముఖంగా వినిపిస్తుంది.గత సీజన్‌లో ఉదయభాను ఉంటుందని అనుకున్నారు.

కాని ఆమె ఆసక్తి చూపడం లేదని సమాచారం.

Telugu Bigg Boss, Bithiri Satti, Sunitha-

మొత్తానికి నాల్గవ సీజన్‌లో మొదటి నాలుగు బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయినట్లే అంటున్నారు.ఇంకా కొంత మంది సినిమా రంగానికి చెందిన వారు ఒక్కరు మీడియా రంగానికి చెందిన వారిని కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లో జాయిన్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్స్‌ను జులై నెలలో పూర్తి చేసే అవకాశం ఉంది.

వచ్చే నెలలో షో ప్రారంభంకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.సెప్టెంబర్‌లో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube