బిగ్ బాస్ 6 లో ఆ ఫేమస్ సింగర్.. ఇతడుంటే ఎంటర్టైనర్ ఉన్నట్టే!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్.ఇది హాలీవుడ్ లో నెంబర్ వన్ షోగా ప్రసారం అవుతుండగా బాలీవుడ్ కూడా ఈ షో ను ఇక్కడకు తీసుకు వచ్చారు.

 Bigg Boss Season 6 Telugu Contestants List Details , Bigg Boss Telugu Season 6,n-TeluguStop.com

ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా ఈ షో ప్రసారం అవుతూ వస్తుంది. బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.

సీజన్ 6 స్టార్ట్ చేయడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి సమాచారం అందుతుంది.ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ లో ఈసారి ఎవరెవరు పాల్గొన బోతున్నారో అని తెలుసుకోవడానికి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతునే ఉంది.

ఈ క్రమంలోనే కొంత మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి.ఇక తాజాగా ఈ సీజన్ లో స్టార్ సింగర్ కూడా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆయన మరెవరో కాదు.

Telugu Bigg Boss, Biggboss, List, Lv Revanth, Nagarjuna-Movie

టాలీవుడ్ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ అని తెలుస్తుంది.ఈయన ఇండియన్ ఐడల్ టైటిల్ పొంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

చూస్తుంటే ఈయన కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది.మరి ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.

గత సీజన్ లో సింగర్ శ్రీరామచంద్ర పాల్గొన్న విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube