బిగ్ బాస్ 5 తెలుగు ఫైనలిస్ట్ లో ఉండేది ఈ ఐదుగురే?

బిగ్ బాస్ సీజన్ 5లో రోజుకో ఆసక్తి కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు, శిక్షలతో మొదటి వారం రోజులు ఉత్కంఠగా సాగింది.

 Bigg Boss Season 5 Top 5 Contestants Fixed-TeluguStop.com

ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న సరయు ఎలిమినేట్ అయ్యింది.

ఇదిలా ఉండగా… బిగ్ బాస్ అంటేనే ఒక డ్రామా… అంతా స్క్రిప్ట్ ప్రకారమే ఆ షో సాగుతుందని సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతునే ఉంది.

 Bigg Boss Season 5 Top 5 Contestants Fixed-బిగ్ బాస్ 5 తెలుగు ఫైనలిస్ట్ లో ఉండేది ఈ ఐదుగురే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హౌజ్ లోకి ఎంటర్ అయిన 19 మంది సభ్యులు… స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా ఒకరు ఏడుపును ఎంచుకుంటే.

మరొకరు కొట్లాడడం, ఇంకొకరు కామెడీ ఇలా ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ ను మెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఇక సరయు అన్న మాటలను బట్టి చూస్తే…అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందన్న ప్రచారంపై నిజమేనని అనిపిస్తోంది.

Telugu Anchor Ravi, Bigg Boss, Bigg Boss 5 Telugu, Contestants, Fixed, Sarayu, Sarayu Shocking Comments, Season 5, Shanmukh Jaswanth, Siri Hanumanthu, Sunny, Top 5-Movie

సిరి హన్మంతు, సన్ని, యాంకర్ రవి, షణ్ముఖ్ పక్కా ప్లాన్ ప్రకారమే గేమ్ ఆడుతున్నారని… వారంతా ఒక్కటై మిగతా వారిని తొక్కేస్తున్నారని సరయు కాంట్రవర్సీని క్రియేట్ చేసే కామెంట్స్ చేశారు.రవి మామూలోడు కాదని, సిరి గెలవడం కోసం మగవాళ్ళను వాడుకుంటుందని… షణ్ముఖ్ సాప్ట్ అనుకున్నా కానీ… ఖతర్నాక్ అని .వాడొక ఆడంగి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సరయు.వీరు నలుగురు మిగతా సభ్యులను తొక్కేసి ….

వీళ్ళల్లోనే ఒకరు కచ్చితంగా టైటిల్ గెలుస్తారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక నిజంగానే వీరు ప్లాన్ తోనే హౌజ్ లోకి వచ్చారా.? వీళ్ళే టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలుస్తారో లేదో.చివరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.!

.

#Season #Contestants #Fixed #Anchor Ravi #Sarayu Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు