బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ కొత్త లిస్ట్ లీక్.. పాల్గొనే సెలబ్రిటీలు వీళ్లేనా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో గత నాలుగు సీజన్లలో ప్రేక్షకుల అంచనాలను మించి ఎంటర్టైన్మెంట్ ను అందించిన సంగతి తెలిసిందే.సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 త్వరగా ప్రారంభం కాగా కరోనా వల్ల సీజన్ 4 ఆలస్యంగా ప్రారంభమైంది.

 Bigg Boss Season 5 Telugu Final Contestant List Leaked Goes Viral In Social Medi-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 5 కూడా ఆలస్యంగా ప్రారంభం కాగా తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా లీక్ అయింది.కొత్తగా లీకైన లిస్ట్ లో గతంలో వినిపించిన పేర్లతో పాటు కొత్త పేర్లు కూడా కనిపిస్తున్నాయి.

వచ్చే నెల నుంచి బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రారంభం కానుండగా మొత్తం 16 మంది బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంటున్నారని ఒక లిస్ట్ వైరల్ అవుతోంది.అయితే నిజంగా వీళ్లే పాల్గొంటారో లేదో తెలియాలంటే మాత్రం షో ప్రారంభమయ్యే వరకు ఆగాలి.

బిగ్ బాస్ సీజన్ 4 సమయంలో కూడా కొన్ని పేర్లు వైరల్ కాగా లిస్ట్ లో లేని కొంతమంది కంటెస్టెంట్లు అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను సైతం అవాక్కయ్యేలా చేశారు.

Telugu Anchor Ravi, Anee Master, Bigg Boss, List, Lobo, Manas, Navya Swamy, Prat

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ లో యాంకర్ రవి ముందువరసలో ఉన్నారు.ఈ మధ్య కాలంలో రవి ఎక్కువగా షోలు చేయడం లేదు.ప్రేక్షకుల్లో రవికి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో రవి బిగ్ బాస్ షోలో పాల్గొంటే బిగ్ బాస్ తర్వాత అతనికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంటుంది.

యూట్యూబ్ ద్వారా భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Telugu Anchor Ravi, Anee Master, Bigg Boss, List, Lobo, Manas, Navya Swamy, Prat

టాలీవుడ్ సినీ నటీమణులలో ఒకరైన ప్రియతో పాటు ఆర్జే కాజల్ కూడా ఈ షోలో పాల్గొనననున్నారని సమాచారం.యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సిరి హనుమంతుతో పాటు సరయు కూడా బిగ్ బాస్ షో జాబితాలో ఉన్నారు.నవ్యస్వామి, ఉమ, లోబో, మానస్, టీవీ నటుడు సన్నీ, అనీ మాస్టర్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, రఘు మాస్టర్, న్యూస్ రీడర్ ప్రత్యూష ఈ జాబితాలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube