బిగ్ బాస్ 5 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కంటెస్టెంట్లు వీళ్లే..?

2020 సంవత్సరంలో ప్రజలెవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ విజృంభించడం వల్ల ప్రజల జీవన విధానంలో కీలక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే.కేంద్రం నిబంధనల వల్ల థియేటర్లు మూతబడటంతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.

 Bigg Boss Season 5 Starts Julay First Week Sources Say, Bigg Boss Season 5, Big-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వాళ్లకు బిగ్ బాస్ షో ద్వారా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికింది.తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నా లవ్ ట్రాకుల వల్ల బిగ్ బాస్ సీజన్ 4 హిట్టైంది.

బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లకు భిన్నంగా సీజన్ 4లో అభిజిత్ రికార్డు స్థాయిలో ఓట్లను పొందడంతో పాటు సీజన్ 4 విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అభిజిత్ కు హీరోగా కూడా ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లకు కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 5పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని ఈ ఏడాది జులై నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానుందని సమాచారం.సీజన్ 4 కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు వస్తుండటంతో సీజన్ 5లో పాల్గొనడానికి చాలామంది సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారని సీజన్ 4పై వచ్చిన విమర్శలు సీజన్ 5 విషయంలో రిపీట్ కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కమెడియన్ హైపర్ ఆది, యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్, టిక్ టాక్, ఢీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దుర్గారావు, స్టార్ యాంకర్ రవి, ఇతర కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube