బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ సీజన్ 5 పది రోజుల క్రితం స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా ప్రారంభమైందనే సంగతి తెలిసిందే.ఈరోజు బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించిన రేటింగ్స్ వివరాలు వెల్లడయ్యాయి.
రికార్డు స్థాయిలో బిగ్ బాస్ షోకు రేటింగ్స్ వస్తాయని భావించిన బిగ్ బాస్ ఫ్యాన్స్ కు సీజన్ 3 రేటింగ్స్ భారీ షాక్ ఇచ్చాయి.అంచనాలకు అందని విధంగా రేటింగ్స్ రావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 ప్రసారం కాగా ఈ షో లాంఛ్ ఎపిసోడ్ కు ఏకంగా 16.18 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.ఆ తర్వాత సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేయగా సిజన్ 2 15.05 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్, సీజన్ 2 తర్వాత నాని బిగ్ బాస్ షోకు దూరం కావడంతో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.బిగ్ బాస్ మూడో సీజన్ కు లాంఛింగ్ ఎపిసోడ్ ఏకంగా 17.92 రేటింగ్ దక్కించుకుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ 18.5 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుని బిగ్ బాస్ హిస్టరీలోనే కొత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది.బిగ్ బాస్ సీజన్ 5 లాంఛింగ్ ఎపిసోడ్ కోసం నిర్వాహకులు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ సీజన్ కు కేవలం 15.7 రేటింగ్ దక్కింది.ఈ రేటింగ్ నాగార్జునకే షాక్ ఇచ్చే విధంగా ఉండటం గమనార్హం.బిగ్ బాస్ సీజన్5లో కంటెస్టెంట్ల విషయంలో నిరాశ ఎదురవుతోంది.
ప్రేక్షకులు గత సీజన్ లా ఈ సీజన్ లో కూడా పరిచయం లేని కంటెస్టెంట్లు ఎక్కువమంది ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ వీక్ డేస్ రేటింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో గొడవలు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.