షన్ను కన్నింగ్ గేమ్.. ఈ వారం సిరి బయటకు రావాల్సిందేనంటున్న నెటిజెన్స్!

ప్రస్తుతం బిగ్ బాస్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది మూడు వారాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి ప్రేక్షకులకు కూడా ఏర్పడ్డాయి.

 Shanmukh Jaswanth, Bigg Boss Telugu 5, Siri, Cunning Game,latest Tollywood News-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే బయట ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పటివరకు ఏ కోవలో గేమ్ ఆడాలని చూస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్ లతో కాకుండా, ఎప్పుడు షణ్ముఖ్ సిరి హనుమంత్ తోనే ఎక్కువగా కలిసి ఉండడం మనం గమనించవచ్చు.అయితే వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్ లో నటించడం చేత బాగా పరిచయం ఉంది.

అదే సమయంలో ఆమె కూడా షణ్ముఖ్ ని వదలడం లేదు.డీప్ లవర్స్ మాదిరి వీళ్ల వ్యవహారం సాగుతుంది.ఒకరి బెడ్ పక్కన మరొకరు బెడ్ వుండడం, ఇద్దరు కలిసి కూర్చుని ఎంతో చనువుగా మాట్లాడటం చూస్తుంటే వీరి మధ్య ఎఫైర్ పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Game, Siri-Movie

ఈ క్రమంలోనే వీరిద్దరూ చేస్తున్నటువంటి కొన్ని పనులు నెటిజన్లకు వీరిద్దరూ ప్రేమపక్షులు గానే కనబడుతున్నారు.బయటికి ఫ్రెండ్స్ అని చెప్పుకునే షన్ను ,సిరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నెటిజన్లు షన్ను మైండ్ గేమ్ తో ఎంతో కన్నింగ్ గా ఆడుతున్నారని, షణ్ముఖ సరైన రీతిలో ఆడాలంటే హౌస్ నుంచి సిరి ఈ వారం బయటకు రావాల్సిందేనంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube