బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీజన్ 5 ఎప్పుడంటే..?  

bigg boss season 5 june or july nagarjuna ip matches.boggboss 5 ,june-july, ipl matches in summer ,bigg boss 5 10 days ,social media biggboss 4,ipl 2021 ,in summer - Telugu Bigg Boss 5, Ipl Matches, July, Nagarjuna

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కాగా ఆ సమయంలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందించింది.మొదట్లో బిగ్ బాస్ సీజన్ 4పై విమర్శలు వ్యక్తమైనా చివరి ఐదు వారాలు బిగ్ బాస్ షోకు భారీగా టీఆర్పీ రేటింగ్ లు వచ్చాయి.

TeluguStop.com - Bigg Boss Season 5 June Or July Nagarjuna Ip Matches

ఇప్పటికే సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది కూడా బిగ్ బాస్ షో ఆలస్యంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

TeluguStop.com - బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీజన్ 5 ఎప్పుడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ షో ఈ ఏడాది జూన్ లేదా జులై నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం.సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఉండటంతో ఆ సమయంలో బిగ్ బాస్ షో ప్రసారం అయితే టీఆర్పీ రేటింగ్ లు తగ్గే అవకాశం ఉంటుంది.

బిగ్ బాస్ సీజన్ 5 కూడా 100 రోజులు ప్రసారం కానుందని నాగార్జునే హోస్ట్ గా ఉండనున్నారని సమాచారం.

Telugu Bigg Boss 5, Ipl Matches, July, Nagarjuna-Movie

ఐపీఎల్ మ్యాచ్ లు గత సీజన్లపై కొంత ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సీజన్ ఆలస్యంగా ప్రారంభం కానుండటం బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారమైతే వీకెండ్ లో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చినా వీక్ డేస్ లో రేటింగ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.మరోవైపు ఈ సీజన్ లో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారినే ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు తక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు ఎక్కువ పాపులారిటీని కలిగి ఉంటారని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే కొంతమంది సీజన్ 5 కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

#Nagarjuna #Ipl Matches #Bigg Boss 5 #July

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు