బిగ్ బాస్ సీజన్ 5 తొలి కంటెస్టెంట్ ఎవరంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ముగిసి రెండు నెలలైనా గడవక ముందే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.డిసెంబర్ నెల 20వ తేదీన బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగియగా మొదట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని సీజన్ 4 చివరి ఐదు వారాలు మాత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచి సక్సెస్ అయింది.

 Bigg Boss Season 5 First  Contestant Name Is Revealed-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా దొరికింది.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని సీజన్ 5 తొలి కంటెస్టెంట్ సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన షణ్ముఖ్ జశ్వంత్ అని తెలుస్తోంది.

సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ కు ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి.యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ హౌస్ కు వెళితే సీజన్ 5 పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరి షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 తొలి కంటెస్టెంటో కాదో తెలియాలంటే మాత్రం కొన్ని నెలలు ఆగాల్సిందే.సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు.

షణ్ముఖ్ కు యూట్యూబ్ లో 26 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Telugu Bigg Boss, Contestant-Movie

బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5లో రవి, హైపర్ ఆదిలను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube