బిగ్ బాస్ సీజన్ 4లో అందరూ ఊహించిన విధంగానే అభిజిత్ విన్నర్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అభిజిత్ బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన విశేషాలను, ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపును ఉపయోగించుకుని హీరోగా విజయాలు అందుకోవాలని హీరోగా తన రేంజ్ ను పెంచుకోవాలని అభిజిత్ భావిస్తున్నారు.
అభిజిత్ కు స్టార్ సెలబ్రిటీల సపోర్ట్ కూడా ఉండటంతో హీరొగా కచ్చితంగా సక్సెస్ అవుతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ తో లవ్ ట్రాక్ కూడా అభిజిత్ ను వార్తల్లో నిలించి.హారిక, అభిజిత్ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చినా బయటకు వచ్చాక వాళ్లిద్దరూ తమ రిలేషన్ ను బిగ్ బాస్ తప్పుగా చూపించారని స్పష్టతనిచ్చారు.
అయితే అభిజిత్ మోనాల్ ను పెళ్లి చేసుకుంటారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
అభిజిత్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిజిత్ తల్లి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ పెళ్లి గురించి స్పష్టతనిచ్చారు.వచ్చే ఏడాది అభిజిత్ పెళ్లి జరగబోతుందని తెలిపారు.తాము చూసిన అమ్మాయితోనే అభిజిత్ పెళ్లి జరుగుతుందని చెప్పారు.
దీంతో బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లతో అభిజిత్ కు పెళ్లి అంటూ వైరల్ అవుతున్న పుకార్లకు ఆమె చెక్ పెట్టారు.అయితే ఎవరితో పెళ్లి అనే వివరాలు అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
మైండ్ గేమ్ తో ఆడి బిగ్ బాస్ విన్నర్ అయిన అభిజిత్ ప్రస్తుతం కెరీర్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టినా ప్రస్తుతం అతని వయస్సు 32 సంవత్సరాలు కావడంతో త్వరగా పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు భావిస్తున్నారు.