కొత్త కారు కొన్న బిగ్ బాస్ అఖిల్.. ఖరీదెంతంటే..?  

bigg boss season 4 contestant akhil purchased new car, bigg boss 4, runner, akhil, new car, cost, luxury car, purchased, honda company, sohel, monal, meheboob, siva jyothi - Telugu 10lakhs, Akhil, Bigg Boss Contestant, Cost, Honda Company, Luxury Car, Meheboob, Monal, New Car, Purchased, Shivajyothi, Siva Jyothi, Sohel

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ఎంతోమంది కంటెస్టెంట్లకు మంచి పేరు, గుర్తింపుతో పాటు ఆర్థికంగా స్థిరపడేందుకు కారణమైన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొందరు కంటెస్టెంట్లు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే మరి కొందరు కంటెస్టెంట్లు కొత్త కారును కొనుగోలు చేశారు.

TeluguStop.com - Bigg Boss Season 4 Contestant Akhil Purchased New Car

తాజాగా కొత్త కారును కొనుగోలు చేసిన కంటెస్టెంట్ల జాబితాలో బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ కూడా చేరారు.

బిగ్ బాస్ లో మోనాల్ తో సన్నిహితంగా మెలిగి అఖిల్ వార్తల్లో నిలిచారు.

TeluguStop.com - కొత్త కారు కొన్న బిగ్ బాస్ అఖిల్.. ఖరీదెంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొత్త కారు కొన్న అఖిల్ కారు కొనుగోలు చేయడం గురించి స్పందిస్తూ తన కల నిజమైందని పేర్కొన్నారు.హోండా కంపెనీ మోడల్ కారును అఖిల్ కొనుగోలు చేశారు.

లగ్జరీ కారును కొనుగోలు చేసిన అఖిల్ ఈ కారు కోసం పది లక్షల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.బిగ్ బాస్ షో రన్నరప్ గా నిలిచిన అఖిల్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తం ఈ కారు కొనుగోలు కోసం ఖర్చు చేశారు.

Telugu 10lakhs, Akhil, Bigg Boss Contestant, Cost, Honda Company, Luxury Car, Meheboob, Monal, New Car, Purchased, Shivajyothi, Siva Jyothi, Sohel-Movie

బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు పలు సీరియళ్లలో నటించిన అఖిల్ కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమా ఆఫర్లతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.25 సంవత్సరాల లోపు కారును కొనుగోలు చేయాలని అనుకున్నానని అదే విధంగా కారును కొనుగోలు చేస్తున్నానని అఖిల్ అన్నారు.తన హార్డ్ వర్క్ వల్ల అమ్మ, నాన్న చూపించిన ప్రేమ వల్ల కారును కొనుగోలు చేయడం సాధ్యమైందని తెలిపారు.

అఖిల్ కొత్త కారును కొనుగోలు చేయడంతో మోనాల్, సోహెల్ తో పాటు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు శుభాకాంక్షలు తెలియజేశారు.

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి ఖరీదైన కారుతో పాటు ఇల్లును కొనుగోలు చేయగా లాస్య, సోహెల్ కూడా ఈ మధ్య కాలంలో కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

#Meheboob #Shivajyothi #Monal #BiggBoss #10lakhs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు