రాహుల్ సిప్లిగంజ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడా….?  

Bigg Boss Season 3 Winner Rahul Sipligunj Marriage - Telugu Bigg Boss Season 3 Winner, Marriage News, Punarnavi Bhupalam, Rahul Sipligunj, Tollywood

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలియని వారుండరు.అయితే ఇతడు అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు కేవలం ఒక సింగర్ గా మాత్రమే పరిచయం.

 Bigg Boss Season 3 Winner Rahul Sipligunj Marriage

కానీ బిగ్ బాస్ సీజన్లో పాల్గొని టైటిల్ విన్ అవ్వడంతో రాహుల్ సిప్లిగంజ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.అయితే తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తన చిన్ననాటి స్నేహితురాలుని పెళ్లి చేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే తాజాగా మరో టాలీవుడ్ ప్రముఖ సింగర్ అయినటువంటి నోయెల్ సీన్ కూడా రాహుల్ సిప్లిగంజ్ కి  పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడా….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకున్నటువంటి  యువతి ఎవరా.? అంటూ తెగ ఆరాతీస్తున్నారు.అయితే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ రాహుల్ మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.దీంతో ఈ వార్తలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.

కాబట్టి కనీసం ఇప్పటికైనా రాహుల్ సిప్లిగంజ్ తన పెళ్లి విషయంపై స్పష్టత ఇవ్వాలని కొంతమంది అభిమానులు కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్నటువంటి టాలీవుడ్ హీరోయిన్ పునర్నవి భూపాలంతో ప్రేమాయణం నడిపినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.అయితే ఇలాంటి వార్తలపై అప్పట్లో పునర్నవి భూపాలం స్పందిస్తూ తాను రాహుల్ సిప్లిగంజ్ కేవలం స్నేహితులని తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని, తాము ప్రేమించుకున్నట్లు వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు