బిగ్ బాస్ రవికృష్ణ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే..?

తెలుగులోని ప్రముఖ ఛానెళ్లలోని సీరియళ్లలో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రవికృష్ణ.మొగలి రేకులు, వరూధిని పరిణయం, మరికొన్ని సీరియళ్లలో నటించిన రవికృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ఆ షో ద్వారా మంచోడుగా పేరు సంపాదించుకున్నారు.

 Bigg Boss Season 3 Contestant Ravikrishna Marriage Fixed, Amekatha Serial, Big B-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో తక్కువ వారాలే ఉన్నా ఎవరినీ నొప్పించని మనస్తత్వం రవికృష్ణను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా సీరియళ్లలో వరుస ఆఫర్లతో రవికృష్ణ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో రవికృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు.నిజ జీవితానికి భిన్నంగా ఉండే పాత్రలో నటిస్తున్న రవికృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటించి మెప్పించారు.

గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న రవికృష్ణ కరోనా సోకిన సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రవికృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.స్టార్ మా ఛానెల్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇట్స్ టైమ్ టు పార్టీ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుంది.ఈ ఈవెంట్ కు రవికృష్ణ అతని తల్లితో పాటు హాజరయ్యారు.

ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న లాస్య రవికృష్ణను పప్పన్నం ఎప్పుడు పెడతారని అడిగింది.

రవికృష్ణ తల్లి ఆ ప్రశ్నకు స్పందిస్తూ ఏప్రిల్ లో పప్పన్నం పెడతామని తెలిపారు.

రవికృష్ణ తల్లి స్పష్టతనివ్వడంతో త్వరలోనే రవికృష్ణ పెళ్లి జరగబోతుందని అర్థమవుతోంది.ప్రాథమికంగా పెద్దలు కుదిర్చిన అమ్మాయినే రవికృష్ణ పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.

అయితే రవికృష్ణ చెబితే మాత్రమే వధువుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube