ఎనిమిదో తరగతిలోనే ప్రేమలో పడ్డానంటున్న బిగ్ బాస్ బ్యూటీ!

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తక్కువ సమయంలోనే పేరు, గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హిమజ ఒకరు.అయితే చాలా సీరియల్స్ లో నటించినా అన్ని వర్గాల ప్రజలకు ఆమె బిగ్ బాస్ షో ద్వారానే చేరువైంది.

 Bigg Boss Season 3 Contestant Himaja Love Story Himaja, Big Boss 3, 8th Class Lo-TeluguStop.com

అటు బుల్లితెరతో పాటు వెండితెరపై చిన్నచిన్నపాత్రల్లో నటించిన నిన్నటితో 31వ వసంతంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం హిమజ ప్రధాన పాత్రలో జ అనే హారర్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది.

నిన్న పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన హిమజ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.తాను ఎనిమిదో తరగతిలోనే ఒక అబ్బాయిని ప్రేమించానని తెలిపింది.ప్రేమించిన అబ్బాయిని ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నానని.ప్రస్తుతం కెరీర్ గురించి తప్ప ప్రేమ, పెళ్లి లాంటి ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది.

ఎవరినైనా ప్రేమించామంటే జీవితాంతం ఆ ప్రేమ ఉంటుందని తెలిపింది.

ఈ సీజన్ లో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరవుతారో ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది.

బిగ్ బాస్ లో మోనాల్ – అభిజిత్, ఇతర లవ్ ట్రాక్ ల గురించి స్పందిస్తూ చాలామంది బిగ్ బాస్ షోలో జరిగే వాటికి లవ్ ట్రాకులని పేర్లు పెడుతున్నారని.బిగ్ బాస్ సీజన్ 3 సమయంలో కూడా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య ఏం లేకపోయినా వాళ్ల మధ్య ఏదో ఉందనేలా వార్తలు వచ్చాయని చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్లకు అది తప్ప మరో ప్రపంచం తెలియదని అందువల్లే ఒకరితో మరొకరు ఫ్రెండ్ షిప్ చేయక తప్పదని పేర్కొంది. బిగ్ బాస్ హౌస్ లో తనకు లవ్ ట్రాక్ అంటూ ఏమీ లేదని హిమజ అభిప్రాయం వ్యక్తం చేసింది.

కొంచెం క్లోజ్ గా ఉంటే హగ్ చేసుకోవడం కామన్ అని వాటిని మరీ పెద్దవి చేసి చూపించడంతో అందరూ లవ్ అనుకుంటున్నారని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube