బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశానంటున్న ప్రముఖ నటి..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మూడేళ్ల క్రితం విజయవంతంగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో హోస్ట్ చేయడంతో బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Bigg Boss Season 1 Contestant Jyoti Sensational Comments About Bigg Boss Show, S-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తొలివారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ జ్యోతి బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిన్న ఆమె పుట్టినరోజు కావడంతో అభిమానులతో మాట్లాడుతూ బిగ్ బాస్ షో హోస్ట్ ల గురించి, బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రతి సంవత్సరం తాను గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేదానినని.ఈ సంవత్సరం వైరస్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో సింపుల్ గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నానని జ్యోతి తెలిపారు.

మొదట పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని అనుకున్నానని కానీ స్నేహితుల బలవంతం వల్ల జరుపుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

బిగ్ బాస్ షో సీజన్ 1కు వెళ్లి తప్పు చేశానని.తొలివారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బాధగా అనిపించిందని.సీజన్ 1కు కాకుండా మరో సీజన్ కు వెళ్లి ఉంటే బాగుండేదని జ్యోతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను బిగ్ బాస్ షోకు వెళ్లే సమయానికి ఆ షో గురించి తనకు పెద్దగా అవగాహన లేదని.బిగ్ బాస్ షో ద్వారా మన వ్యక్తిత్వం ఏమిటో మనం తెలుసుకోవచ్చని ఆ షోలో ఇచ్చే టాస్కుల ద్వారా మనలోని రియాలిటీ బయటపడుతుందని అన్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ షోకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని కంటెస్టెంట్లు వస్తున్నారని.సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లు ఎక్కువగా బిగ్ బాస్ షోలోకి వస్తున్నారని సీజన్ 4 కంటెస్టెంట్లను ఉద్దేశించి జ్యోతి అన్నారు.

హోస్టింగ్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ అని.నాని సిల్లీగా, నాగార్జున చిల్ బ్రో అనేలా ఉంటారని జ్యోతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube