మిస్టర్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్న బిగ్ బాస్ సోహెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన కంటెస్టెంట్ ఎవరని అడిగితే మాత్రం ముందు సోహెల్ పేరే వినిపిస్తుంది.ఎందుకంటే హౌస్ లో ఉన్నంత కాలం తనేంటో తాను నిరూపించుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఫేస్ టు ఫేస్ డీల్ చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

 Bigg Boss Sohel Latest Movie Mr Pregnant First Look Release, Mr.peagnant, First-TeluguStop.com

అంతేకాకుండా పలు ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకున్నాడు.ఇదిలా ఉంటే మిస్టర్ ప్రెగ్నెంట్ గా కనిపించనున్నాడు సోహెల్.

బిగ్ బాస్ హౌస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహెల్ ఆ తర్వాత ఆ క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు.సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా కనిపిస్తాడు.

తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటాడు.పైగా తనతో పాటు పాల్గొన్న కంటెస్టెంట్ లతో కూడా పార్టీలని తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ విషయం గురించి గతంలో తాను అభిమానులతో పంచుకోగా.

తాజాగా తాను నటిస్తున్న సినిమా నుండి ఓ అప్ డేట్ వచ్చింది.

Telugu Bigg Boss, Bigg Boss Sohel, Relesae, Mrpeagnant, Sohel, Sohelpregnant, So

ఇక ఈ సినిమాకు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమాకు డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.మైక్ మూవీస్ బ్యానర్ లో అన్నపరెడ్డి, అప్పి రెడ్డి, రవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సోహెల్ ప్రెగ్నెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

Telugu Bigg Boss, Bigg Boss Sohel, Relesae, Mrpeagnant, Sohel, Sohelpregnant, So

తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త ప్రేమకథ వినోదంతో పాటు ప్రయోగాత్మక కథగా రూపొందుతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ఆ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అందులో సిగరెట్ కాలుస్తూ చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని కనిపించగా మరోవైపు గోడపై తన షాడోలో మాత్రం తను ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.

దీన్ని బట్టి ఈ సినిమా టైటిలే ఇంతా ఆసక్తిగా ఉండగా సినిమా కథ ఎంతగా ఆసక్తిగా ఉంటుందో అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube