ఈ టూర్ చెయ్యడానికి నాకు సిగ్గనిపిస్తుంది.. బిగ్ బాస్ కంటెస్టెంట్ సావిత్రి కామెంట్స్ వైరల్!

తీన్మార్ సావిత్రి.ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలే లేరు.

 Bigg Boss Savitri Comments About Her Fridge Tour Video Viral Details, Bigg Boss, Savitri, Fridge Tour, Comment, Viral, Savitri Fridge Tour, Teenmaar Savitri, Shiva Jyothi, Bithhiri Sathhi, Ismart News, Savitri About Fridge Tour, Bigg Boss Savitri-TeluguStop.com

ఎందుకంటే తన మాటలతో తెలంగాణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Bigg Boss Savitri Comments About Her Fridge Tour Video Viral Details, Bigg Boss, Savitri, Fridge Tour, Comment, Viral, Savitri Fridge Tour, Teenmaar Savitri, Shiva Jyothi, Bithhiri Sathhi, Ismart News, Savitri About Fridge Tour, Bigg Boss Savitri-ఈ టూర్ చెయ్యడానికి నాకు సిగ్గనిపిస్తుంది.. బిగ్ బాస్ కంటెస్టెంట్ సావిత్రి కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా తనతో పాటు మరో యాంకర్ బిత్తిరి సత్తి కూడా అందరికీ తెలిసిందే.ఇక అతనిని తమ్ముడు అనుకుంటూ మాటలతో బాగా సందడి చేసేది.పైగా అందులో సావిత్రి కట్టుబొట్టు కూడా బాగా ఉండేది.దాంతో తీన్మార్ వార్తలు రేటింగు లో కూడా మొదటి స్థానంలో ఉండేది.

అలా మనకు పరిచయమైన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి.

ఈమె తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, నాగంపేట గ్రామానికి చెందినది.

ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.

ఇక ఆమె కెరీర్ మొదట్లో తన భాష వల్ల, తన గొంతు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.అదే సమయంలో v6 ఛానల్ వారు తెలంగాణ భాషలో మాట్లాడే వాళ్ళ గురించి ప్రకటించడంతో అందులో చదివి మంచి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

ఇక అలా v6 లో తీన్మార్ సావిత్రిలా, బుగ్గల జాకెట్ ధరించుకున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత సావిత్రికి బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.

ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.

వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది.పైగా ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో ఇప్పటికి చాలా వీడియోలు పంచుకుంది.ఇక తాజాగా ఒక వీడియో పంచుకోగా అది తన ఫ్రిడ్జ్ టూర్ అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.ఇక ఆ వీడియో చేస్తే తనకు సిగ్గుగా ఉంది అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube