డిప్రెషన్‌లోకి బిగ్ బాస్ సరయు.. మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ?

యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న 7 ఆర్ట్స్ సరయు ఈసారి బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే వీడియోలలో ఎక్కువ శాతం సరయు బోల్డ్ వ్యాఖ్యలు చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Bigg Boss Sarayu Wild Card Entry Into Depression-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు.అయితే హౌస్ లోకి వెళ్ళిన సరియు తన బూతులతో ఇతర కంటెస్టెంట్ లతో రచ్చ చేస్తారని ప్రేక్షకులు భావించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఈమెను మొదటివారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

ఈ విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన క్రియేట్ చేసిన కంటెంట్ చూపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఎంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తను బయట ఎవరితో మాట్లాడటానికి కానీ, కలవడానికి గాని ఇష్టపడటం లేదని తన సన్నిహితులు తెలియజేస్తున్నారు.

 Bigg Boss Sarayu Wild Card Entry Into Depression-డిప్రెషన్‌లోకి బిగ్ బాస్ సరయు.. మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సరయు బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తుందని తన సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి.

యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సరియు, తన బూతు మాటలతో బాగా పాపులర్ అయింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఈమెను లోపలికి పంపించడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని బిగ్ బాస్ భావించారు.అయితే సరయు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎంతో భిన్నంగా ప్రవర్తించారు.

హౌస్ లో ఉన్న సభ్యులందరూ ఒకటి అయితే ఈమె మాత్రం ఒకవిధంగా ప్రవర్తించేది.అదేవిధంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో కూడా ఈమె ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయకుండా ఉండటంతో సరయు మొదటివారంలోనే ఎలిమినేట్ అయింది.

అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కార్యక్రమం చూసిన సరయు తాను హౌస్ లో ఉన్నన్ని రోజులు క్రియేట్ చేసిన కంటెంట్ చూపించకపోవడంతో ఆశ్చర్యపోతూ.ఎవరినీ కలవకుండా డిప్రెషన్ లో ఉందని తెలుస్తోంది.

#Biggg Boss #Reality Show #Wildcard #Sarayu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు