కట్నం వల్ల నా పెళ్లి ఆగిపోయింది.. బిగ్ బాస్ సరయు కామెంట్స్ వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి తొలి వారం ఎలిమినేట్ కావడం ద్వారా సరయు వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడటం వల్లే ఆమె ఎలిమినేట్ అయ్యారని చాలామంది భావిస్తారు.

 Bigg Boss Sarayu Comments About Her Breakup Love Story-TeluguStop.com

యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సరయుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.అయితే సరయు వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరయు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒక వ్యక్తితో తాను ఏకంగా ఏడు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నానని సరయు చెప్పుకొచ్చారు.

 Bigg Boss Sarayu Comments About Her Breakup Love Story-కట్నం వల్ల నా పెళ్లి ఆగిపోయింది.. బిగ్ బాస్ సరయు కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాననే విషయం తన కుటుంబ సభ్యులతో పాటు అవతలి వ్యక్తి కుటుంబ సభ్యులకు సైతం తెలుసని సరయు వెల్లడించారు.తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా తాను ఏ పని చేయనని సరయు అన్నారు.

ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో తను కెరీర్ ను కూడా పక్కన పెట్టానని సరయు చెప్పుకొచ్చారు.రిలేషన్ షిప్ లో అతడికి అన్నీ ఇచ్చేశానని అయితే తాను, అవతలి వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కుదరలేదని సరయు వెల్లడించారు.కట్నం విషయంలో తలెత్తిన వివాదం వల్ల వివాహం ఆగిపోయిందని ఆమె కామెంట్లు చేశారు.ప్రేమించిన వ్యక్తి మొదట పాతిక లక్షలు అడిగాడని ఆ తరువాత సగం ఆస్తి అడిగాడని ఆమె అన్నారు.

పెళ్లికి ముందే అలా చేస్తే పెళ్లైన తర్వాత ఏం చేస్తాడో అనిపించిందని సరయు చెప్పుకొచ్చారు.ఆ రీజన్ వల్లే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని సరయు తెలిపారు.ప్రేమించిన వ్యక్తి ముఖం మీద ఆ వ్యక్తి తనకు తగిన వ్యక్తి కాదని చెప్పానని సరయు పేర్కొన్నారు.

#Biggoss #Biggboss #Dowry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు