స్వీట్ మెమరీ అంటూ హోమ్ టూర్ చేసిన ఆర్.జె కాజల్.. వీడియో వైరల్!

ఆర్.జె కాజల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Bigg Boss Rj Kajal Home Tour Video Viral Details, Rj Kajal, Tollywood, Bigg Boss, Home Tour, Video Viral,bigg Boss Kajal, Bigg Boss Rj Kajal, Rj Kajal Home Tour, Faria Abdullah, Rj Kajal Home,-TeluguStop.com

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు.ఇక కాజల్ మాట్లాడటం మొదలు పెట్టింది అంటే ఇక ఈమె మాటలకు అడ్డుకట్ట వేయలేము అనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా నిత్యం తన మాటలతో సందడి చేసే కాజల్ తాజాగా తన హోమ్ టూర్ వీడియో ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం కాజల్ నివసిస్తున్న ఇంటిని తన హోమ్ టూర్ చేసి చూపించారు.

 Bigg Boss Rj Kajal Home Tour Video Viral Details, Rj Kajal, Tollywood, Bigg Boss, Home Tour, Video Viral,bigg Boss Kajal, Bigg Boss Rj Kajal, Rj Kajal Home Tour, Faria Abdullah, Rj Kajal Home, -స్వీట్ మెమరీ అంటూ హోమ్ టూర్ చేసిన ఆర్.జె కాజల్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం తన ఇంటిని నీటుగా సర్దలేదని అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులలో ఈ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఈ హోమ్ టూర్ చేయాల్సి వచ్చిందని, ఈ ఇంటి స్వీట్ మెమరీగా హోమ్ టూర్ చేసి మీకు చూపించాలని అనుకున్నాము అంటూ తన హోమ్ టూర్ చేసి చూపించారు.ఈ క్రమంలోనే లివింగ్ ఏరియా అలాగే తనకు స్కూల్ నుంచి వచ్చిన బహుమతులను, కాజల్ ఈ హోమ్ టూర్ ద్వారా చూపించారు.

అదేవిధంగా తన ఇంటిలో అమర్చిన పుస్తకాలను చూపెడుతూ అందులో తనకు ఒక పుస్తకాన్ని జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బహుమతిగా ఇచ్చిందని చెప్పింది.అదే విధంగా వారి బెడ్ రూమ్ అలాగే గెస్ట్ రూమ్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించారు.ఇకపోతే బాల్కనీలో తన పెంచుకున్న మొక్కలను కూడా కాజల్ ఈ వీడియోలో చూపించారు.ఇక తన ఇంటిని మొత్తం చూపెడుతూ త్వరలోనే ఈ ఇంటిని ఖాళీ చేస్తున్నామని ఈమె వెల్లడించారు.

ఇక ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఒక సొంతిల్లు ఉండాలని అది అపార్ట్మెంట్ కాకుండా సొంతంగా ఇల్లు ఉండాలంటూ ఈమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube