బిగ్ బాస్ హౌస్ లో షన్ను.. ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కిందంటే?

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి మనందరికీ తెలిసిందే.బోలెడంత పాపులారిటి తో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ అంతకు రెండింతలు నెగిటివిటీని మూటగట్టుకుని మరి బయటకు వచ్చాడు.

 Bigg Boss Ott Non Stop Shanmukh Jaswanth Bb House Details,  Bigg Boss, Shanmukh-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో క్లోజ్ గా ఉంటూ, ఆమెపై పెత్తనం చెలాయించడమే కాకుండా, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయాడు.అంతే కాకుండా గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి సిరి తో క్లోజ్ గా మూవ్ అవుతూ మెదిలాడు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.

ఇక అలా షణ్ముఖ్ తన చేతులారా బిగ్ బాస్ టైటిల్ ను చేజార్చుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచాడు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని ప్రియురాలు దీప్తి బ్రేకప్ చెప్పడంతో ఒకింత శూన్యంలోకి వెళ్ళిపోయాడు.అయితే బిగ్ బాస్ హౌస్ లో తాను చేసిన తప్పులను ఒప్పుకుంటూ తనపై పెరిగిన నెగిటివిటీ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు షణ్ముఖ్ జశ్వంత్.

ఇక షణ్ముఖ్ జస్వంత్ లో వచ్చిన మార్పును చూసి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తిట్టిన వారే ప్రస్తుతం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్స్ గేమ్ అలరించేందుకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో ఒక గేమ్ ఆడించగా అందులో యాంకర్ శివ గెలుపొందాడు.

అప్పుడు అఖిల్ కు మిస్టరీ బాక్స్ రాగా అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్లే గేమ్లో ముందుకు వెళ్లాలని రాసుండడంతో అనిల్, బాబా భాస్కర్, బిందు మాధవి లో పోటీదారులుగా ఎంపిక అవ్వగా ఈ జాబితాలో శివ లేదా అఖిల్ లో ఎవరో ఒకరు చేరినట్లు తెలుస్తోంది.మరి జాబితాలో శివ చేరాడా, లేకపోతే అఖిల్ చేరాడా అన్నది తెలియాలి అంటే బిగ్ బాస్ షోని చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube