బాత్ రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్.. అసలు ఆమె ఏమన్నదంటే?

తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.అయితే బిగ్ బాస్ షో ఒక గంట ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉండడంతో, ఆ విషయంపై ఆలోచించిన బిగ్ బాస్ షో నిర్వాహకులు కేవలం గంట మాత్రమే ఎందుకు చూపించాలి.

 Bigg Boss Non Stop Winner Bindu Madhavi About Smocking Bigg Boss Non Stop, Bindhu Madhavi, Smocking, Akhil, Sravanthi-TeluguStop.com

హౌస్ లో ఏం జరుగుతుంది అన్నది 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో చూస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తో బిగ్ బాస్ నాన్-స్టాప్ షోని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.అయితే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తేవడంతో పాటుగా నిరంతరం చూడలేని వారి కోసం ప్రత్యేకంగా గంట ఎపిసోడ్ ని కూడా పెట్టారు బిగ్ బాస్ షో నిర్వాహకులు.

ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇటీవలే తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ లు కెమెరా లకు సైతం కనబడకుండా అషు, బిందు లాంటి వారు సీక్రెట్ గా సిగరెట్ తాగారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

 Bigg Boss Non Stop Winner Bindu Madhavi About Smocking Bigg Boss Non Stop, Bindhu Madhavi, Smocking, Akhil, Sravanthi-బాత్ రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్.. అసలు ఆమె ఏమన్నదంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయి అని, బాత్రూంలో కూడా పొగ వాసన వస్తుంది అంటూ నటరాజ్ మాస్టర్ పసిగట్టిన విషయం తెలిసిందే.ఇక అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సిగిరెట్ తాగావా అని ప్రశ్నించగా.

ఆ ప్రశ్నకు అషు సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది.తాజాగా బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన బిందు మాధవి తన అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా చిట్ చాట్ నిర్వహించింది.

ఈ క్రమంలోనే ఆమెకు కూడా అదే ప్రశ్న ఎదురయింది.నువ్వు బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ చేస్తున్నావని స్రవంతి.అఖిల్ తో పాటు అతని ఫ్రెండ్స్ కు కూడా చెప్పింది అందులో ఎంతవరకు నిజం అని ఒక అభిమాని ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన బిందుమాధవి.

తాను అసలు సిగరెట్ తాగలేదని స్పష్టం చేసింది. ఒకవేళ తనకు ఆ అలవాటు ఉంటే ఓపెన్ గా స్మోకింగ్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube