దేవుడున్నాడు..నా కష్టానికి ఫలితం దక్కింది: నటరాజ్ మాస్టర్ వైరల్ కామెంట్స్

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.

 Bigg Boss Non Stop Natraj Master Fight Akhil Sarthak Details,  Akhil Sarthak, Bi-TeluguStop.com

అయితే ఫైనల్స్ దగ్గరపడుతుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ నువ్వానేనా అన్న విధంగా జరుగుతోంది.హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎలా అయినా సరే టాప్ ఫైవ్ లో నిలవాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి మాస్టర్ ఒంటరిగా పోరాడుతూ వస్తున్న విషయం తెలిసిందే.తాను ఒంటరిగా పోరాడటమే కాకుండా అవసరమైనప్పుడు తన ఫ్రెండ్స్ కు కూడా సహాయం చేశాడు నటరాజ్ మాస్టర్.

కానీ తాజాగా జరిగిన టాస్క్ లో తనకు బదులుగా అఖిల్ వేరొకరికి సహాయం చేసి అతడిని గెలిపించడాన్ని నట్రాజ్ మాస్టర్ తట్టుకోలేకపోయాడు.గెలుపు తనదే అనుకున్న సమయంలో ఓటమి పాలు కావడంతో ఆ బాధను భరించలేక పోయాడు నట్రాజ్ మాస్టర్.

ఈ క్రమంలోనే బాధపడ్డాడు, ఎమోషనల్ అయ్యాడు, కోపంతో ఊగిపోయాడు.తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన బీబీ ఆవుల కొట్టం టాస్క్ లో అఖిల్ నట్రాజ్ మాస్టర్ ల మధ్య చిన్న ఫైట్ జరిగింది.

ఈ టాస్క్ లో మాస్టర్ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్ తన పాలన్ని కూడా ఒలక బోసాడు.

నీకు అత్యాశ ఎక్కువ అని అఖిల్ ఫైర్ అవ్వడంతో దీనికి నటరాజ్‌ స్పందిస్తూ.నన్ను ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు, దేవుడున్నాడు, నా కష్టానికి ఫలితం దక్కింది అని మాట్లాడాడు.నటరాజ్‌ మాటలను బట్టి అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని గెల్చినట్లు తెలుస్తోంది.

మరి అఖిల్‌, నటరాజ్‌ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లింది? వీళ్లు తిరిగి కలిసిపోయారా? లేదా? అన్నదీ తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube